Peddi 3 days AP TG collections: పెద్ది బాక్సాఫీస్ కలెక్షన్లు.. రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెద్ది బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అసాధారణమైన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు భారీగా కనెక్ట్ అవ్వడంతో ఏపీ, తెలంగాణలో థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు పెరిగాయి. మూడు రోజుల్లో బాక్సాఫీస్ బరిలో సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

బాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రీమియర్ల ద్వారా 19 కోట్ల నెట్, 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకోగా.. తొలి రోజు రూ.51 కోట్ల నెట్‌కలెక్షన్లు అందుకుంది. ఇక రెండో రోజు దేశవ్యాప్తంగా రూ.26.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజు అయిన శనివారం దేశవ్యాప్తంగా రూ.28.85 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో రోజు వచ్చిన రూ.26.90 కోట్లతో పోలిస్తే 7.2 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం 9,019 షోలలో 36.6 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.125.25 కోట్ల నెట్, రూ.149.07 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది పెద్ది.

Peddi AP TG Collections

ఇక మొత్తం కలెక్షన్లను పరిశీలిస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 'పెద్ది' ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.115.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక మూడో రోజు కూడా తెలుగు వెర్షన్ నుంచే ఏకంగా రూ.25.60 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. మొత్తం 17,105 షోలలో ప్రదర్శితమైన తెలుగు వెర్షన్‌కు సగటున 60.5 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇది సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అద్భుత ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇక ఆక్యుపెన్సీ పరంగా చూస్తే.. విశాఖపట్నంలో అత్యధికంగా 78.5 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా, కాకినాడలో 72 శాతం, హైదరాబాద్‌లో 64.3 శాతం, గుంటూరులో 64.8 శాతం, విజయవాడలో 62 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా రాత్రి షోలకు ప్రేక్షకులు భారీగా తరలివస్తుండటంతో అనేక ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'పెద్ది' జోరు కొనసాగుతోంది. మూడో రోజు విదేశాల్లో రూ.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో మొత్తం రూ.42 కోట్ల ఓవర్సీస్ గ్రాస్ సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.191.07 కోట్లకు చేరుకున్నాయి. రూ.200 కోట్ల మార్క్‌కు కేవలం అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.110 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన 'పెద్ది', రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత వేగంగా కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే నాలుగో రోజు ముగిసే నాటికి రూ.200 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ క్లబ్‌లోకి సినిమా ఘనంగా అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.220 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో పెట్టుబడిదారులు లాభాల్లోకి రావాలంటే సినిమా కనీసం రూ.230 కోట్ల షేర్, దాదాపు రూ.440 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.191 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన 'పెద్ది', తన బ్రేక్ ఈవెన్ లక్ష్యంలో దాదాపు సగం దూరాన్ని పూర్తి చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

వీకెండ్ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగితే త్వరగానే లాభాల జోన్‌లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రెండో వారం నుంచి సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో నిలకడగా ఉంటాయన్నదే తుది ఫలితాన్ని నిర్ణయించనుంది. తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న భారీ స్పందన, ఓవర్సీస్ మార్కెట్‌లో నమోదవుతున్న బలమైన వసూళ్లను బట్టి చూస్తే 'పెద్ది' డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు అందించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X