Peddi AP TG Collections: వీకెండ్‌లో మళ్లీ పెద్ది జోరు.. 11 రోజుల్లో రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi Box office collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణను అందుకుంటూ భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. వీక్ డేస్‌లో కలెక్షన్లు పడిపోయినా రెండో వీకెండ్‌లో మరోసారి వసూళ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టింది? అనే వివరాల్లోకి వెళ్తే..

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. వీక్ డేస్ లో కలెక్షన్లు పడిపోయినా వీకెండ్ లో మాత్రం కలెక్షన్లు పెరిగాయి. ఇక 11వ రోజు ఆదివారం 'పెద్ది'మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా 4,133 షోల ద్వారా 9.20 కోట్ల రూపాయాల నెట్ వసూలు చేసింది. దీంతో విడుదలైన 11 రోజుల్లో 'పెద్ది'ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 216 కోట్ల రూపాయాల నెట్ కలెక్షన్లు, 256. 23 కోట్ల రూపాయాల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Peddi AP TG Collections Ram Charan s Film Crosses 147 Cr Share in Telugu States in 11 Days

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇప్పటివరకు విదేశాల్లో 51. 75 కోట్ల రూపాయాల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఈ పెద్ది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 307. 98 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే.. పెద్ది మూవీ 11 రోజుల్లో 393 కోట్ల రూపాయాలు రాబట్టినట్టు చిత్ర బృందం వెల్లడించింది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాలే 'పెద్ది'కి ప్రధాన బలం అని చెప్పాలి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో195. 30 కోట్ల రూపాయాల గ్రాస్ వసూళ్లు సాధించి, పెద్ది విజయంలో కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. ఇక కర్ణాటకలో 27. 58 కోట్ల రూపాయాలు, తమిళనాడులో 6. 05 కోట్ల కోట్ల రూపాయాలు, కేరళలో 72 లక్షల రూపాయాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 26. 58 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి.

ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఇప్పటి వరకూ 147.04 కోట్ల రూపాయాల షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఏరియాల వారీగా చూస్తే నిజాం ప్రాంతంలో 55.81 కోట్ల రూపాయల షేర్‌తో 'పెద్ది'తన సత్తా చాటింది. ఇక సీడెడ్‌లో 20.26 కోట్ల రూపాయాలు, ఉత్తరాంధ్రలో 22.07 కోట్ల రూపాయాలు వసూలు చేసింది. అలాగే ఈస్ట్ గోదావరిలో 12. 30 కోట్ల రూపాయాలు, వెస్ట్ గోదావరిలో 8. 78 కోట్లు రూపాయాలు, గుంటూరులో 11.82 కోట్లు రూపాయాలు, కృష్ణా జిల్లాలో 9.90 కోట్లు రూపాయాలు, నెల్లూరులో 6.10 కోట్ల రూపాయాలు అందుకున్నట్లు తెలుస్తోంది.

వీకెండ్ కలెక్షన్లు మరింత ఊపందుకోవడంతో ఈ సినిమా త్వరలోనే మరిన్ని రికార్డులను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా 'పెద్ది' నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇక రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల్లో 'పెద్ది' ఒకటిగా నిలిచింది. ఇప్పటికే పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ ముగిసే నాటికి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X