Peddi Day 13 AP, TG Collections: పెద్ది కలెక్షన్లు డ్రాప్‌.. 13 రోజుల్లో రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi Day 13 AP, TG Collections: : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో తెరకెక్కిన సినిమా 'పెద్ది'.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. వీకెండ్ లో కలెక్షన్లు జోరందుకున్న వీక్ డేస్‌లో కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా 13 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టింది? అనే వివరాల్లోకి వెళ్తే..

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం..వీకెండ్ లో కలెక్షన్లు పెరిగినా వీక్ డేస్ లో కలెక్షన్లు పడిపోతున్నాయి. 13వ రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 3. 45 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. మొత్తం 3,898 షోలకు కేవలం 20.5 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. భాషల వారీగా చూస్తే తెలుగు వెర్షన్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 2.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించగా, హిందీ వెర్షన్ 60 లక్షల రూపాయలు, కన్నడ వెర్షన్ లో కేవలం 7 లక్షలు, తమిళ వెర్షన్ లో కేవలం 3 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు అందుకున్నాయి.

Peddi AP TG Collections

ఇప్పటివరకు పెద్ది సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 223. 55 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, 264. 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ వాటా అత్యధికం. తెలుగు భాషలోనే ఈ సినిమా 198. 45 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు కాగా, 211 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అందుకుంది. హిందీ వెర్షన్ ద్వారా 21. 22 కోట్ల రూపాయలు, తమిళంలో 1. 94 కోట్ల రూపాయలు, కన్నడలో 1. 64 కోట్ల రూపాయాలు, మలయాళంలో 30 లక్షల రూపాయాల నెట్ వసూళ్లు అందుకున్నాయి.

ఇక పెద్ది ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 264. 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించగా, ఓవర్సీస్‌లో మరో 52. 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 317.12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను తన ఖాతాలో వేసుకుంది పెద్ది. ఈ వసూళ్లతో సూర్య నటించిన తమిళ బ్లాక్‌బస్టర్ 'కరుప్పు' (రూ.308 కోట్లు) రికార్డును అధిగమించిన 'పెద్ది', 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లోనూ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. పెద్ది 10 రోజుల్లో రూ. 378 కోట్ల కలెక్షన్లు వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో 'పెద్ది' స్థిరమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగుతుంది. ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఇప్పటి వరకూ 151.04 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఏరియాల వారీగా చూస్తే నైజాం ప్రాంతంలో 57.21 కోట్ల రూపాయల షేర్‌తో 'పెద్ది'తన సత్తా చాటింది. ఇక సీడెడ్‌లో 21.26 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 22.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈస్ట్ గోదావరిలో 12.8 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 9 కోట్లు రూపాయలు, గుంటూరులో 12 కోట్లు రూపాయలు షేర్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీక్ డేస్ లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాననే చెప్పాలి.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X