Peddi AP-TG collection: తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది' ఊచకోత.. రామ్ చరణ్ మూవీకి రెండో రోజు ఎన్ని కోట్లంటే?

Peddi Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మొదటి రోజు సంచలన ఓపెనింగ్స్ నమోదు చేయగా, రెండో రోజు కూడా అదే జోష్ లో అద్భుతమైన వసూళ్లు అందుకుంది. సాధారణంగా ఏ భారీ సినిమా అయినా మొదటి రోజు తర్వాత కొంత డ్రాప్ నమోదు చేయడం సహజం. అయితే 'పెద్ది' విషయంలో కలెక్షన్లు తగ్గినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ది కలెక్షన్స్ ఎంత? అనే వివరాల్లోకి వెళ్తే..

పెద్ది బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా , రెండో రోజు దేశవ్యాప్తంగా రూ.26.90 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. తొలి రోజు రూ.51 కోట్ల నెట్‌తో పోలిస్తే 47.3 శాతం డ్రాప్ కనిపించినప్పటికీ, అది ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేసే స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్‌కు ముందు వచ్చే శుక్రవారం రోజున కూడా సినిమా స్ట్రాంగ్ హోల్డ్‌ను కొనసాగించడం విశేషంగా మారింది.

Peddi AP TG Collections Ram Charan s Film Storms in Telugu States Crosses 150 Crore Worldwide

తెలుగు రాష్ట్రాలే 'పెద్ది'కి అసలు బలం
తెలుగు రాష్ట్రాల్లో పెద్ది తన సత్తా చాటుకుంటోంది. వాస్తవానికి 'పెద్ది' విజయానికి ప్రధాన కారణం తెలుగు ప్రేక్షకుల ఆదరణ. రెండో రోజు మొత్తం రూ.26.90 కోట్ల నెట్ కలెక్షన్లలో రూ.24.20 కోట్లు తెలుగు వెర్షన్ నుంచే రావడం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. అంటే దేశవ్యాప్తంగా వచ్చిన వసూళ్లలో దాదాపు 90 శాతానికి పైగా వాటా తెలుగు ప్రేక్షకులదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు లభిస్తున్న స్పందన ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యువత, రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివస్తున్నారు. నైట్ షోలలో నమోదైన ఆక్యుపెన్సీ చూస్తే ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతోంది. ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 233 షోలలో ఏకంగా 78.8 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోల నుంచే భారీ స్పందన లభించగా, సాయంత్రం, నైట్ షోలు అన్ని హౌస్‌ఫుల్.

విశాఖ తర్వాత కాకినాడలో 76.8 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. చిన్న కేంద్రంగా భావించే కాకినాడలో ఈ స్థాయి స్పందన రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక విజయవాడలో 68 శాతం, గుంటూరులో 60.8 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రామ్ చరణ్‌కు ఉన్న అభిమాన బలం మరోసారి కలెక్షన్ల రూపంలో కనిపించింది.

ఇక తెలంగాణలో అత్యధిక షోలు ప్రదర్శించిన కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. మొత్తం 946 షోలతో 52.3 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఇందులో అత్యంత ఆసక్తికర అంశం నైట్ షోల స్పందన. రాత్రి షోలకు ఏకంగా 73 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వరంగల్‌లో 60.5 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో కూడా మంచి స్పందన కనిపించింది. తెలంగాణలో వీకెండ్ షోల బుకింగ్స్ మరింత స్ట్రాంగ్ గా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు వెర్షన్‌తో పోలిస్తే ఇతర భాషల్లో 'పెద్ది' ప్రభావం అంతగా కనిపించలేదు. రెండో రోజు హిందీ వెర్షన్ రూ.2.25 కోట్ల నెట్ వసూలు చేయగా, తమిళంలో రూ.25 లక్షలు, కన్నడలో రూ.17 లక్షలు, మలయాళంలో కేవలం రూ.3 లక్షల నెట్ మాత్రమే నమోదైంది. దీంతో ఈ సినిమా సక్సెస్ ప్రస్తుతం పూర్తిగా తెలుగు మార్కెట్‌పైనే ఉందని స్పష్టమవుతోంది.

రెండు రోజుల్లో రూ.150 కోట్ల గ్రాస్.. ఇక టార్గెట్ 500 కోట్లు?
ఇక పెద్ది రెండు రోజుల కలెక్షన్లు చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.96.40 కోట్ల నెట్, రూ.114.49 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఇక ఓవర్సీర్ కూడా పెద్ది మంచి వసూళ్లును అందుకుంటుంది. విదేశాల్లో ఇప్పటికే రూ.36 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ.150.49 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్‌ను అందుకుంది.

సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.220 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో లాభాల్లోకి వెళ్లాలంటే సినిమా కనీసం రూ.450 నుంచి రూ.500 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న స్పందన, వీకెండ్ అడ్వాంటేజ్, రామ్ చరణ్ క్రేజ్‌ను బట్టి చూస్తే 'పెద్ది'కి ఆ లక్ష్యం అసాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా విశాఖ, విజయవాడ, కాకినాడ, హైదరాబాద్ వంటి ప్రధాన కేంద్రాల్లో నమోదవుతున్న ఆక్యుపెన్సీ చూస్తే, ఈ వీకెండ్ ముగిసే సరికి సినిమా మరిన్ని భారీ రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'పెద్ది' పేరు బాక్సాఫీస్ వద్ద గట్టిగా వినిపిస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో పెద్ది ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో..

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X