Peddi Closing Collections: పెద్ది క్లోజింగ్ కలెక్షన్లు.. రాంచరణ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ జర్నీని సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను, ట్రోల్స్‌ను తట్టుకొని దాదాపు నాలుగు వారాలపాటు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Peddi Box Office Closing Collections

పెద్ది సినిమాలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారానికి వస్తే.. ఈ చిత్రం ఏపీ, నైజాం ఏరియాల వారీగా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 136 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 17 కోట్ల రూపాయలు, తమిళనాడు 6 కోట్ల రూపాయలు, కేరళ 2 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 34 కోట్ల రూపాయల మేర జరిగింది. టోటల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయల మేర పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 440 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 230 కోట్ల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

స్పోర్ట్స్ రూరల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగులో 218.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.5 కోట్ల రూపాయలు, కన్నడలో 31 కోట్ల రూపాయలు, కేరళలో 75 లక్షల రూపాయలు, నార్త్ ఇండియాలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 28 రోజుల్లో ఈ చిత్రం 284 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.

పెద్ది చిత్రం ఓవర్సీస్‌లో తొలుత భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయింది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు కలిపి ఈ చిత్రం సుమారుగా 53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 337 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమా 420 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని చెప్పారు.

పెద్ది చిత్రం 220 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం ఇప్పటి వరకు 204 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అంటే ఈ చిత్రం ఇంకా 11 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌లో 95 శాతం రికవరీని సాధించింది అని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.

ఈ సినిమా లాభ నష్టాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు మినహాయిస్తే.. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ టాక్‌తో ముగిసింది. కర్ణాటకలో ఈ చిత్రం 95 శాతం రికవరీని సాధించింది. తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. దాంతో భారీ నష్టాలతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే నిర్మాతల లెక్కల ప్రకారం ఈ సినిమా దాదాపు మంచి లాభాలను పంచి పెట్టిందనే భావించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X