Peddi Day 26 Collections: దారుణంగా పడిపోయిన పెద్ది వసూళ్లు.. ఆ టార్గెట్ అందుకోవడం ఇక కష్టమేనా?

Peddi Box Office Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి వారంలో రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసినప్పటికీ, రెండో వారం నుంచి కలెక్షన్లలో తగ్గుదల కనిపిస్తోంది. అయితే, వీకెండ్ లో కాస్తా పుంజుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కానీ, నాలుగో ఆదివారం మాత్రం అత్యంత స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. ఇక వీక్ డేస్ రావడంతో మరోసారి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ తరుణంలో పెద్ది రోజువారీ కలెక్షన్లు ఎంత? 26 రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే

పెద్ది మొదటి వారం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రోజువారీ కలెక్షన్లను పరిశీలిస్తే.. ప్రీమియర్స్‌తో 21.83 కోట్ల రూపాయలు, మొదటి రోజు 60.66 కోట్ల రూపాయలు, రెండో రోజు 32.00 కోట్ల రూపాయలు, మూడో రోజు 34.88 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 38.24 కోట్ల రూపాయలు వసూలు చేసి తొలి వారంలోనే 229.95 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. అయితే రెండో వారంలో మొత్తం 40.10 కోట్ల రూపాయలు, మూడో వారంలో 10.75 కోట్ల రూపాయలు మాత్రమే రావడం ద్వారా కలెక్షన్లలో తగ్గుదల కనిపించింది. నాలుగో వారంలో కూడా 23వ రోజు 1.05 కోట్ల రూపాయలు, 24వ రోజు 0.92 కోట్ల రూపాయలు, 25వ రోజు 1.18 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

Peddi Box Office Expected Collection Day 26

ఇక 25వ రోజు (ఆదివారం) పెద్ది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం 1.05 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకుంది. దీంతో పెద్ది మొత్తం కలెక్షన్స్ 240. 14 కోట్ల రూపాయల నెట్, 283.95 కోట్ల రూపాయల(గ్రాస్)కు చేరాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే 52.90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 336. 85 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను దాటింది. మొత్తంగా చూస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 336 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. .

ఇక భాషల వారీగా చూస్తే, తెలుగు వెర్షన్ ఇప్పటికీ ప్రధాన బలంగా నిలుస్తోంది. తెలుగు వెర్షన్ ఒక్కటే రూ.213.51 కోట్ల నెట్ వసూలు చేయగా, హిందీ వెర్షన్ రూ.22.47 కోట్ల నెట్, తమిళ వెర్షన్ రూ.2.00 కోట్ల నెట్, కన్నడ వెర్షన్ రూ.1.86 కోట్ల నెట్, మలయాళ వెర్షన్ రూ.0.30 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టాయి. మొత్తం వసూళ్లలో దాదాపు 89 శాతం తెలుగు వెర్షన్ నుంచే రావడం విశేషం. దీని బట్టి చూస్తే.. తెలుగు మార్కెట్‌పై పెద్ది వసూళ్లు ఆధారపడినట్లు స్పష్టం చేస్తోంది.

26 రోజు అంచనా కలెక్షన్లు
ఇక 26వ రోజు అంచనా కలెక్షన్లు విషయాన్ని వస్తే.. సోమవారం 685 షోలతో కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రారంభ గణాంకాల ప్రకారం.. మధ్యాహ్నం వరకు రూ.0.14 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ లెక్కన చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 70 లక్షల నుంచి 80 లక్షల వరకు వసూలు చేసే అవకాశముందని అంచనా. దీంతో ఇండియా నెట్ రూ.241 కోట్లకు, గ్రాస్ రూ.285 కోట్లకు చేరుకునే అవకాశముందని, ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.338 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

2026లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా 'పెద్ది' నిలిచినా, నాలుగో వారంలోకి అడుగుపెట్టిన 'పెద్ది'కలెక్షన్ల దారుణంగా పడిపోయాయి. సుమారు 350 కోట్ల రూపాయల బడ్జెట్ నేపథ్యంలో ఇప్పటివరకు పెట్టుబడిలో కేవలం 70 శాతం మాత్రమే రికవరీ అయినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సమంత నటించిన 'మా ఇంటి బంగారం' మంచి మౌత్ టాక్‌తో రన్ అవుతుండటంతో 'పెద్ది' స్క్రీన్లు తగ్గాయి. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి నిర్మాతలకు 100 కోట్ల రూపాయలకు పైగా లోటు ఉండే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో థియేట్రికల్ రన్ ముగిసే నాటికి సినిమా తుది బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X