PEDDI: నార్త్ అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. రిలీజ్‌కు ముందే ఆల్ టైమ్ రికార్డ్..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా( Buchi Babu Sana) కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా 'పెద్ది' (Peddi). ఈ మూవీ ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై మొదటి రోజు నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించగా.. ఇప్పుడు ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌తో 'పెద్ది' మరోసారి రికార్డుల మోత మోగిస్తోంది.

పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా వ్యవహరిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో హైప్‌ను మరింత పెంచుతోంది. ముఖ్యంగా 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇందులో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. 'పెహిల్వాన్' తరహా పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారనే వార్తలు ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను స్కై లెవల్‌కు తీసుకెళ్లాయి.

Peddi Creates All-Time North America Pre-Sales Record Before Ram Charan s Release

ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, విజి చంద్రశేఖర్, రజత్వ దత్తా, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. ఇక సాంకేతిక విభాగం కూడా 'పెద్ది'కి మరో బలం అని చెప్పాలి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలీ నిర్వహిస్తున్నారు.

మొదట ఈ సినిమా రిలీజ్ పలు మార్లు వాయిదా పడినప్పటికీ.. చివరకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక జూన్ 3న నార్త్ అమెరికా సహా పలు దేశాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే హిందీలో ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios) విడుదల చేయనున్నారు. నార్త్ ఇండియాలో రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదల చేస్తామని దర్శకుడు సుకుమార్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'పెద్ది' దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే భారీ స్పందన రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు క్రియేట్ చేసింది. బుక్సింగ్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే ప్రీ-సేల్స్‌లో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ 100K డాలర్ల మార్క్‌ను చేరుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే విడుదలకు చాలా రోజుల ముందే దాదాపు రూ.95 లక్షల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. ఓవర్సీస్‌లో ఈ స్థాయి బుకింగ్స్ రావడం రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. జూన్ 3న నార్త్ అమెరికా అంతటా గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికాలో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. బుచ్చిబాబు సానా మాస్ ఎమోషన్స్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారో, రామ్ చరణ్‌ను ఏ స్థాయిలో చూపించబోతున్నారో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 'పెద్ది' మొదటి రోజు ఓపెనింగ్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రావడం.. సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో 'ఆర్ఆర్ఆర్' తర్వాత మరో గ్లోబల్ హిట్‌గా 'పెద్ది' నిలుస్తుందా? బుచ్చిబాబు సానా మరోసారి మ్యాజిక్ చేస్తారా? అన్న ఆసక్తి ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X