Peddi: రామ్ చరణ్ నయా రికార్డు.. సలార్, పుష్ప 2 సరసన పెద్ది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది'సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుండగా, విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంటోంది. పాజిటివ్ సొంతం చేసుకుని దూసుకెత్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో 'పెద్ది' మేనియా కనిపిస్తుండగా, ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బుక్ మై షో (BMS)లో నమోదవుతున్న టికెట్ బుకింగ్స్ ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సలార్, పుష్ప 2, కల్కి సరసన చేరింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే టాక్ వినిపిస్తోంది. జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుండగా, శివ రాజ్‌కుమార్ పాత్ర సెకండాఫ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు. సాంకేతిక విభాగం కూడా సినిమాకు భారీ ప్లస్‌గా మారింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Peddi Creates New BookMyShow Record Ram Charan Joins Salaar Pushpa 2 and Kalki Elite Club

ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పెద్ది' హవానే కనిపిస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలనం సృష్టించిన 'పెద్ది', విడుదలైన తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో (BMS)లో 'పెద్ది'కి వస్తున్న స్పందన ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

గంటకు 40 వేలకుపైగా టికెట్లు బుక్ అవుతూ ఈ సినిమా అరుదైన ఘనతను సాధించింది. బుక్ మై షో 2023లో ప్రారంభించిన 'అవర్లీ ట్రెండింగ్' ఫీచర్‌లో ఈ మైలురాయిని అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకు కల్కి 2898 AD, సలార్, పుష్ప 2 మాత్రమే ఈ ఫీట్ సాధించగా, ఇప్పుడు 'పెద్ది' కూడా ఆ ప్రతిష్టాత్మక జాబితాలో చేరింది. విడుదలైన తొలి రోజే ఈ మార్క్‌ను దాటడం ద్వారా రామ్ చరణ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక కర్ణాటకలో కూడా 'పెద్ది' ప్రభంజనం కొనసాగుతోంది. అక్కడ ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా రూ.3.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కర్ణాటకలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ నమోదు చేసిన తొలి తెలుగు సినిమాగా 'పెద్ది' నిలిచింది. గతంలో ఓజీ రూ.2.72 కోట్లు, రాజాసాబ్ రూ.2.61 కోట్లు, పుష్ప 2 రూ.2.55 కోట్లతో ఉన్న రికార్డులను అధిగమిస్తూ పెద్ది కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

ఈ రికార్డులు చూస్తుంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా రామ్ చరణ్ మార్కెట్ ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. 'పెద్ది' తొలి రోజు దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తోందని తెలుస్తోంది. రామ్ చరణ్‌ ఫ్యాన్ బేస్ కారణంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 నుంచి రూ. 100 కోట్ల వరకు ఓపెనింగ్ కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీమియర్స్, ఓపెనింగ్ నాడే ఇలాంటి స్పందన రావడంతో తొలి వారం ముగిసేలోపు 'పెద్ది' మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more about: ram charan pushpa 2 peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X