Peddi Day 1 Advance Booking: షాకింగ్‌గా పెద్ది అడ్వాన్స్ బుకింగ్.. రాంచరణ్ మూవీ కలెక్షన్లపై ఆ దెబ్బ!

పెద్ది చిత్రం అడ్వాన్స్ బుకింగ్ వ్యవహారం తెలంగాణలో ఓ కొలిక్కి వచ్చింది. టికెట్ల రేట్ల పెంపుపై ప్రభుత్వంతో నిర్మాతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో ఒక రోజు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించి, ఏపీ, నార్త్ ఇండియా, నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో ఇప్పటికే ముందస్తు టికెట్ బుకింగ్ మొదలైన సంగతి తెలిసిందే. జూన్ 3వ తేదీ నుంచి తెలంగాణలో కూడా అడ్వాన్స్ బుకింగ్ జోరందుకొన్నది. ఈ సినిమాకు సంబంధించి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ ఎన్ని కోట్లు అనే వివరాల్లోకి వెళితే..

రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది చిత్రం టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం తెలంగాణలో గందరగోళంగా మారింది. టికెట్ రేట్ల పెంపు ఉంటుందా? ఉండదా? అనే విషయంపై ఊగిసలాట చివరి వరకు కొనసాగింది. ఎప్పడో ప్రారంభం కావాల్సిన అడ్వాన్స్ బుకింగ్ చివరకు ఒక రోజు ముందుగా మొదలైంది. అప్పటికే ఎదురు చూస్తున్న మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు టికెట్లను బుక్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. పలు చోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయనే విషయం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సైట్స్ చూస్తే అర్ధమవుతున్నది.

Peddi Day 1 Advance Booking Collections

ఓవర్సీస్‌లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వారం ముందే మొదలైంది. అయితే ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం.. అమెరికా, కెనడా, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్లు నమోదు అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో ఈ సినిమా ఇప్పటి వరకు 14.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా ఒక రోజు సమయం ఉన్నందున్న ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో సునాయాసంగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నార్త్ అమెరికాలో పెద్ది సినిమా ప్రీమియర్ షోలకు మంచి స్పందనే కనిపిస్తున్నది. ఈ చిత్రం కోసం 550 లోకేషన్లలో 1650 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు. దాదాపు 30 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తాజా సమాచారం ప్రకారం అమెరికాలోనే ఈ చిత్రం 900K డాలర్లు వసూలు చేసింది. గత రెండు రోజుల్లో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో అమ్మకాలు ఊపందుకొన్నాయి అని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.

ఇక ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3వ తేదీన ప్రదర్శించనున్న ప్రీమియర్లు ద్వారా ఈ చిత్రం 5 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. కర్నాటకలో 2 కోట్ల రూపాయల వరకు, ఇండియాలో మొత్తంగా 10 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళనాడు, కేరళ, ఇతర ప్రాంతాల్లో నమోదైన కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పెద్ది మూవీ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు ఈ సినిమా 25 కోట్లకుపైగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది. సాయంత్రానికి కల్లా ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. ప్రీమియర్లు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 12 కోట్ల మేర నమోదయ్యాయని తెలుస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు ప్రీమియర్లతో కలిపి 45 నుంచి 50 కోట్ల షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. టికెట్ రేట్ల పెంపు వ్యవహారం నాన్చుడు ధోరణి వల్ల ఈ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం పడిందనే టాక్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నది.

Read more about: peddi ram charan janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X