Peddi Day 1 Box Office: గేమ్ ఛేంజర్ కలెక్షన్లను పెద్ది బ్రేక్ చేస్తుందా? రాంచరణ్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతాడా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం అభిమానుల్లో అంచనాలు క్రియేట్ చేస్తున్నది. కానీ ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని క్రియేట్ చేయలేకపోతున్నది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు ముందు ఉన్న క్రేజ్.. ట్రైలర్ రిలీజ్ తర్వాత చల్లబడ్డది. అంతేకాకుండా ఈ సినిమాపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ విపరీతంగా జరుగుతున్నది. దాంతో ఈ సినిమాపై ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది? ఈ మూవీ తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయి? నార్త్ ఇండియా, కర్ణాటక‌లో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ చిత్రం రాంచరణ్ స్టామినా ఏంటో చెబుతుందా? అనేది ప్రశ్నగా మారింది. పెద్ది అడ్వాన్స్ బుకింగ్, కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

పెద్ది సినిమాకు సంబంధించి ఓవర్సీస్, కర్ణాటక, ఆంధ్రాలో అడ్వాన్స్ బుకింగ్ ఘనంగా మొదలైంది. అయితే టికెట్ రేట్ల పెంపు వ్యవహారం లేని రాష్ట్రాల్లో రాంచరణ్ సినిమాకు ఎలాంటి సమస్యలు ఏర్పడటం, కనిపించడం లేదు. కానీ తెలంగాణలో టికెట్ల పెంపు వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఇంకా అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టలేదు. టికెట్ రేట్ల పెంపు విషయంలో కోర్టు జోక్యం ఉండటం వల్ల ఈ డైలీ సీరియల్‌లా కొనసాగుతుంది అని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

Peddi Day 1 Box Office Prediction

ఇక పెద్ది సినిమాకు నార్త్ అమెరికాలో ఓ మోస్తారు స్పందన కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మేర వసూళ్లను సాధించింది. అంటే ఈ చిత్రం సుమారుగా 10 కోట్ల మేర కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. రిలీజ్‌కు, ప్రీమియర్లకు ఒక రోజు సమయం ఉండటంతో ఆ కలెక్షన్లు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడ్డారు.

ఇక కర్ణాటకలో కూడా రాంచరణ్ సినిమాకు మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే కోటి రూపాయలు అడ్వాన్స్ సాధించింది. ఇంకా ఈ రేంజ్ పెరిగే అవకాశం ఉంది. అయితే కీలకమైన ఆంధ్రా, తెలంగాణలోనే ఇంకా ఊపందుకోకపోవడం మెగా అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. అయితే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్ది మూవీకి ముందు రాంచరణ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి రోజు 84 కోట్ల రూపాయల గ్రాస్.. 46 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ లెక్కలు, వివాదాలు పక్కన పెడితే.. ప్రస్తుం పెద్ది తొలి రోజు కలెక్షన్లపైనే అందరి చూపు ఉంది.

పెద్ది ప్రీమియర్లు, తొలి రోజు కలిపి ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుంది? ఈ చిత్రం గేమ్ ఛేంజర్ మించి వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తుందా? ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధిస్తుందా? అనేది రెండు రోజులు ఆగితే స్పష్టం కానున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X