Peddi Day 1 Box Office Collections: పెద్దికి వరల్డ్ వైడ్ రికార్డు ఓపెనింగ్స్.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Peddi Day 1 Box Office Collections

పెద్ది సినిమా పిరియాడిక్ నేచర్ ఉన్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం భారీగా సెట్స్ వేశారు. అందమైన లోకేషన్లలో పాటలు, సన్నివేశాలను చిత్రీకరించారు. పాన్ ఇండియా మూవీ కావడంత పలు భాషలకు సంబంధించిన నటులను ఎంపిక చేశారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారానికి వస్తే.. ఈ చిత్రం ఏపీ, నైజాం ఏరియాల వారీగా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 136 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 17 కోట్ల రూపాయలు, తమిళనాడు 6 కోట్ల రూపాయలు, కేరళ 2 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 34 కోట్ల రూపాయల మేర జరిగింది. టోటల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయల మేర పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పెద్ది సినిమా ప్రమోషన్స్‌కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాను ఇండియాలో భారీగా రిలీజ్ చేశారు. నార్త్ ఇండియాలో ధురంధర్ మూవీని రిలీజ్ చేసిన జియో సంస్థ డిస్టిబ్యూట్ చేసింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేసింది. దాదాపుగా ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

రాంచరణ్, జాన్వీ కపూర్ తొలిసారి కలిసి నటించడంతో ఈ మూవీపై అంచనాలు, క్రేజ్ పెరిగింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఆలస్యంగా ఓపెన్ అయినా వేగంగా రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. పెయిడ్ ప్రివ్యూ ద్వారా ఈ సినిమా 38 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 18 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలి రోజు కోసం ఈ సినిమా 63 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది అని ట్రేడ్ రిపోర్టుల బయటకు వచ్చాయి.

పెద్ది సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. తెలుగులో 32 కోట్ల రూపాయలు, హిందీలో 3 నుంచి 4 కోట్ల రూపాయలు, కన్నడలో 5 కోట్ల రూపాయలు తమిళంలో 1 కోటి రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని అంచనా వేస్తున్నారు. నైట్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగితే భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు 125 నుంచి 140 కోట్ల మధ్య కలెక్షన్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X