Peddi Day 10 Box Office: 400 కోట్ల వైపు పెద్ది పరుగు.. వీకెండ్‌లో కలెక్షన్ల పట్టుతో రాంచరణ్ మూవీ

విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన పెద్ది చిత్రం ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ప్రతీ రోజు 5 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం సగటు ప్రేక్షకుడి ఆదరణ కనిపిస్తున్నది. రిలీజ్ తర్వాత రెండు, మూడు రోజుల పాటు జరిగిన నెగిటివ్ ట్రోలింగ్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటం ఖాయమనే స్థాయి నుంచి 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల వైపు పరుగులు పెడుతుండటం ఈ సినిమా యూనిట్ ఊరట కలిగించే అంశంగా మారింది. ఈ చిత్రం గత 9 రోజుల్లో ఏ మేరకు వసూళ్లను సాధించింది. 10వ రోజు ఈ చిత్రం కలెక్షన్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

పెద్ది చిత్రం గత 9 రోజుల్లో ఆంధ్రా, నైజాంలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తెలంగాణలో 48.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 18.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 19.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మిగితా జల్లాలో కలిపి 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 131.5 కోట్ల రూపాయల షేర్.. 197 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Peddi Day 10 Box Office

తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే.. కన్నడ తప్పా మిగితా రాష్ట్రాల్లో పెద్ది ప్రభావం కనిపించలేదు. కర్నాటకలో ఈ చిత్రం 25 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించగా, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 24 కోట్ల రూపాయలు, కేరళలో 72 లక్షల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇండియాలో ఈ సినిమా 56 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రాంచరణ్ నటించిన ఈ చిత్రం 9వ రోజు ఇండియాలో 6 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 235 కోట్ల రూపాయల గ్రాస్, 200 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల కాలంలో 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఈ సినిమా భారీగా వసూళ్లను నమోదు చేసినప్పటికీ.. థియేట్రికల్ బిజినెస్ ప్రకారం చూసుకొంటే చాలా తక్కువగా వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లకు చేరువ కాగా, ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను సాధించిందని ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది.

ఇక 10వ రోజు కూడా ఈ చిత్రం స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం రెండో వారంలో కూడా గౌరవప్రదమైన వసూళ్లను సాధిస్తున్నది. వీకెండ్ కావడంతో ఈ చిత్రం మెరుగైన కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం రెండో శనివారం 7 నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 9 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 366 కోట్ల రూపాయలు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 10వ రోజు 375 కోట్ల మార్క్ టచ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 400 కోట్ల మైలురాయికి మరింత చేరువ అయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X