Peddi Day 12 Box Office Collections: వీకెండ్‌లో పెద్ది మాస్ బ్యాటింగ్.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సోషల్ మీడియాలో ఎదురైన ప్రతికూలతలను అధిగమిస్తూ పెద్ది చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఇండియాలో 300 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. రాంచరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం గత 11 రోజులుగా కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం రెండో వారంలో కనీసం 10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తూ ముందుకెళ్తున్నది. పెద్ది చిత్రం 11 రోజుల్లో ఎంత వసూలు చేసింది? 12వ రోజు కలెక్షన్ల అంచనా ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ కారణంగా భారీ బిజినెస్ నమోదైంది. దాంతో ఈ చిత్రం ముందు 440 కోట్ల రూపాయల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగించింది.

పెద్ది చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో కలెక్షన్ల ప్రయాణాన్ని కొనసాగించింది. తొలివారం భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం మొదటి వారం ముగిసే సమయానికి 194 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 175 కోట్ల రూపాయలు, కర్నాటకలో 24.5 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 30 కోట్ల వరకు వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రెండో వారంలో ఈ చిత్రం ఇండియాలో స్ట్రాంగ్‌గా కలెక్షన్లను నమోదు చేసుకొన్నది. 9వ రోజు శుక్రవారం 6 కోట్ల గ్రాస్, 10వ రోజు శనివారం 9.5 కోట్లు, 11వ రోజు ఆదివారం 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 11 రోజుల్లో 216 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇంకా బెటర్‌గా వసూళ్లను నమోదు చేస్తూ ముందుకెళ్లడంపై ట్రేడ్ వర్గాల్లో సానుకూలత కనిపిస్తున్నది.
గత 11 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో 256 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో 195 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 28 కోట్ల రూపాయలు, కేరళలో 72 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
పెద్ది చిత్రానికి ఓవర్సీస్‌లో తొలివారం మంచి ఆదరణ కనిపించింది. ఆ తర్వాత రెండో వారంలో ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లు కలిపి ఈ చిత్రం సుమారుగా 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో భారీ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది అని తెలిపారు.
గత 11 రోజుల్లో పెద్ది ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ 19.5 కోట్ల రూపాయలు, ఇండియాలో 256 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 52 కోట్ల రూపాయలు కలిపి 328 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే 393 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా 12వ రోజు విషయానికి వస్తే.. ఈ చిత్రం రెండో సోమవారం కలెక్షన్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం సుమారుగా 5 నుంచి 6 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఇండియాలో 260 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయలు వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications