Peddi Day 13 Box Office: 400 కోట్ల క్లబ్‌లో పెద్ది.. రాంచరణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరించారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Peddi 13 Days Box Office Collections

పెద్ది సినిమాలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారానికి వస్తే.. ఈ చిత్రం ఏపీ, నైజాం ఏరియాల వారీగా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 136 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 17 కోట్ల రూపాయలు, తమిళనాడు 6 కోట్ల రూపాయలు, కేరళ 2 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 34 కోట్ల రూపాయల మేర జరిగింది. టోటల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయల మేర పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 440 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 230 కోట్ల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

పెద్ది చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలివారం ముగిసే సమయానికి 194 కోట్ల రూపాయలు ఇండియా వైడ్‌గా రాబట్టింది. తమిళంలో ఈ సినిమా 6.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, కేరళలో 72 లక్షల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ, ఇతర ప్రాంతాల్లో 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 220 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తొలి వారంలో ఈ చిత్రం ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు నమోదు చేసినప్పటికీ..రెండో వారంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 3.3 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ కంట్రీస్‌, ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 5.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో కలెక్ట్ చేసిన వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌తో కలిపి ఈ చిత్రం మొత్తంగా 313 కోట్ల రూపాయల గ్రాస్, 220 కోట్ల నెట్ వసూలు చేసింది అని తెలిపింది. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని తెలిపారు. ఇక ఈ చిత్రం 12వ రోజు 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టగా.. 13వ రోజు మరో 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం 405 కోట్ల రూపాయలు నమోద చేస్తుంది. అలాగే ప్రొడ్యూసర్ లెక్కల ప్రకారం.. ఇంకా 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X