Peddi Day 14 Box Office: పెద్ది మరో సంచలనం.. బాక్సాఫీస్‌ను కుమ్మేసిన రాంచరణ్ మూవీ

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరి విమర్శకుల నోళ్లకు ధీటైన సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. జాన్వీ కపూర్, జగపతి బాబు తదతరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి అనేక ప్రతికూలతలను, నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నది. అయినప్పటికీ ఈ చిత్రం ఎక్కడా కూడా తన కలెక్షన్ల జోరు ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ సినిమాకు సగటు ప్రేక్షకుడు జై కొట్టడంతో ఈ ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా గత 13 రోజుల్లో ఎంత వసూలు చేసింది? 14వ రోజు కలెక్షన్ల అంచనా ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా గత 13 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. పెద్ది చిత్రం పెయిడ్ ప్రీమియర్ల ద్వారా భారీగా అంటే 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 77 కోట్ల రూపాయలు, రెండో రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 43.5 కోట్ల గ్రాస్, 4వ రోజు 47 కోట్లు, ఐదో రోజు 15 కోట్ల గ్రాస్, ఆరో రోజు 13 కోట్ల గ్రాస్, ఏడో రోజు 9.5 కోట్లు, ఎనిమిదో రోజు 7.5 కోట్ల గ్రాస్, తొమ్మిదో రోజు 6.6 కోట్ల, పదో రోజు 10.6 కోట్ల, 11వ రోజు 11 కోట్ల, 12వ రోజు 4.5 కోట్ల, 13వ రోజు కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం 350 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

Peddi Day 14 Expected Box Office

ఇక ఇండియాలో కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలివారం అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 194 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టింది. రెండోవారంలో ఇప్పటి వరకు కలిపి 224.5 కోట్ల రూపాయలు నెట్, 265 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక రాష్ట్రాల వారీగా కలెక్షన్లను చూస్తే.. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 201.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.25 కోట్లు, కర్ణాటకలో 31 కోట్ల రూపాయలు, కేరళలో 72 లక్షల రూపాయలు, హిందీలో 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 265 కోట్ల వసూళ్లను నమోదు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.

ఈ చిత్రం 13వ రోజున కలెక్షన్లు తగ్గినప్పటికీ.. స్టడీగా వసూళ్లను రాబట్టడం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు ఊరట కలిగిస్తున్నది. ఈ సినిమా మంగళవారం 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 14వ రోజున 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం ఇండియాలో 270 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 355 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా వసూళ్లు నిర్మాతలు ప్రకటించిన వసూళ్లు ట్రేడ్ కలెక్షన్లకు భిన్నంగా ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 400 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

పెద్ది సినిమాలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 220 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 440 కోట్ల రూపాయలు. ఇప్పటికే నిర్మాత, దర్శకులు 400 కోట్లకుపైగా వసూళ్లను సాధించిందని ప్రకటించారు. కనుక ఈ చిత్రం మరో 440 కోట్ల రూపాయలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటిన చిత్రంగా ఘనతను సాధిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X