Peddi Day 15 Box Office: ఆగని పెద్ది బాక్సాఫీస్ బ్యాటింగ్ జోరు.. రాంచరణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరించారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Peddi Day 15 Expected Box Office

పెద్ది సినిమాలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారానికి వస్తే.. ఈ చిత్రం ఏపీ, నైజాం ఏరియాల వారీగా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 136 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 17 కోట్ల రూపాయలు, తమిళనాడు 6 కోట్ల రూపాయలు, కేరళ 2 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 34 కోట్ల రూపాయల మేర జరిగింది. టోటల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయల మేర పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 440 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 230 కోట్ల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

పెద్ది చిత్రం రికార్డు ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే తొలి వారాంతం తర్వాత ఈ సినిమా నెగిటివ్ ప్రచారం కారణంగా కలెక్షన్లు కొంత మేరకు మందగించాయి. అయితే ఆ తర్వాత పుంజుకొని నిలకడగా వసూళ్లను సాధించింది.ఈ చిత్రం తొలి వారం ముగిసే సమయానికి 194 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను ఇండియాలో వసూలు చేసింది. ఇక ఈ చిత్రం రెండో వారంలో కూడా డీసెంట్ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 34 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను తెలుగు, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 204 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. తమిళనాడులో 6.5 కోట్లు, కర్ణాటకలో 31 కోట్ల రూపాయల నెట్, కేరళలో 72 లక్షల రూపాయల నెట్, ఉత్తరాది రాష్ట్రాల్లో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో 268 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో 52 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 320 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

రాంచరణ్ నటించిన ఈ సినిమా 14వ రోజున 3 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక 15వ రోజున ఈ సినిమా మరో 3 కోట్ల రూపాయలను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని నిర్మాత, దర్శకులు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. నిర్మాతల లెక్కల ప్రకారం.. 35 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X