Peddi Day 16 AP, TG Collections: పెద్దిపై మా ఇంటి బంగారంఎఫెక్ట్? రామ్ చరణ్ మూవీ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే!
Peddi Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బాక్సాఫీస్ వద్ద రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు సమంత 'మా ఇంటి బంగారం'తో పాటు వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడు 'బాలన్ ది బాయ్', విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు' సహా హర్షిత్ రెడ్డి 'దీవానా' సినిమాలతో పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా 16 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టింది? అనే వివరాల్లోకి వెళ్తే..
'పెద్ది' సినిమా దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ బెల్ట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాకు రికార్డు స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' థియేట్రికల్ హక్కులు సుమారు 220 కోట్ల రూపాయలకు విక్రయించబడింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే ఈ సినిమా కనీసం 230 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రేక్ ఈవెన్ మార్క్ సుమారు 440 కోట్ల రూపాయలు గ్రాస్‌గా నిర్ణయించబడింది.

పెద్ది సినిమా 16వ రోజు అయిన మూడో శుక్రవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు అందుకుంది. అయితే.. 15వ రోజు వచ్చిన 2 కోట్ల రూపాయలతో పోలిస్తే 12.5 శాతం తగ్గడం గమనార్హం. ఇప్పటి వరకు 16 రోజుల్లో 'పెద్ది' ఇండియాలో 229.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే 272.05 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసింది.
ఇక భాషల వారీగా 16వ రోజు వసూళ్లను పరిశీలిస్తే తెలుగు వెర్షన్ నుంచి 1.60 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి. హిందీ వెర్షన్ నుంచి 10 లక్షల రూపాయలు, కన్నడ వెర్షన్ నుండి 4 లక్షలు, తమిళ వెర్షన్ నుంచి 1 లక్ష రూపాయల నెట్ వసూలు చేసింది. మొత్తం కలెక్షన్లలో తెలుగు వెర్షన్ ప్రధాన వాటాను అందించడం విశేషం.
ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం సినిమా వసూళ్లు క్రమంగా తగ్గుతున్నాయి. 16వ రోజు విదేశీ మార్కెట్ల నుంచి కేవలం 5 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ మొత్తం ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్లు 52.60 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' 16 రోజుల మొత్తం గ్రాస్ కలెక్షన్లు 324.65 కోట్ల రూపాయలకు చేరుకోరుకుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేసింది. మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకంగా 254. 8 కోట్ల రూపాయల గ్రాస్, రూ.159 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ఈ కలెక్షన్లలో నైజాం ఏరియా కలెక్షన్లు అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ ఏకంగా 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి, 54.2 కోట్ల రూపాయల షేర్‌ను అందుకుంది. మరోవైపు సీడెడ్ ఏరియాలో కూడా 34 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుని 21.5 కోట్ల రూపాయల షేర్‌ను రాబట్టింది. ఈ రెండు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్ర (UA)లో 38 కోట్ల రూపాయల గ్రాస్, 22.5 కోట్ల రూపాయల షేర్ నమోదు కాగా, ఈస్ట్ గోదావరి జిల్లాలో 22కోట్ల రూపాయల గ్రాస్, 12.7 కోట్ల రూపాయల షేర్ వసూలైంది. వెస్ట్ గోదావరిలో 15 కోట్ల రూపాయల గ్రాస్, 9 కోట్ల రూపాయల షేర్ అందుకుంది. ఇక గుంటూరులో రూ.24.8 కోట్ల రూపాయల గ్రాస్,12.24 కోట్ల రూపాయల షేర్ అందుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ స్థిరమైన వసూళ్లు నమోదు కావడంతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డులను సృష్టిస్తోంది.
ఏపీ-తెలంగాణ మొత్తం మీద 16 రోజుల్లో 254.8 కోట్ల రూపాయల గ్రాస్, 159 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది'పెద్ది'. అయితే.. ఈ సినిమా తాజాగా సమంత మా ఇంటి బంగారం, రష్మిక కాక్ టెయిల్ 2 సినిమాలను పోటీ ఎదుర్కొంటుంది. 'పెద్ది' బ్రేక్ ఈవెన్ మార్క్ సుమారు 440 కోట్ల రూపాయల గ్రాస్‌గా నిర్ణయించబడింది. ప్రస్తుతం 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 324.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ లక్ష్యానికి కొద్దీ దూరంలోనే ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, వీకెండ్ కలెక్షన్లు కీలకంగా మారనున్న నేపథ్యంలో 'పెద్ది' రూ.440 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంటుందా? బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా నిలుస్తుందా? అన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.


Click it and Unblock the Notifications




