Peddi Day 16 Box Office:'పెద్ది' పై రష్మిక సినిమా ఎఫెక్ట్.. 16వ రోజు రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi Box Office Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కిన సినిమా పెద్ది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న విడుదలైంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ సినిమా మొదట నుంచి మిక్స్డ్ రివ్యూలు అందుకున్నప్పటికీ.. విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. బాక్సాఫీస్ బరిలో తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? థియేటర్లలో విడుదలైన 16వ రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసింది? మూడో శుక్రవారం వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే..

Also Read
నాని 'ది ప్యారడైజ్'మళ్లీ వాయిదా పడుతుందా? అలా జరిగితే కోట్లలో నష్టం!
నాని 'ది ప్యారడైజ్'మళ్లీ వాయిదా పడుతుందా? అలా జరిగితే కోట్లలో నష్టం!

పెద్ది సినిమా సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ మార్కెట్, ఓవర్సీస్ హక్కులు కలిపి మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.220 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం దాదాపు రూ.440 కోట్ల గ్రాస్, రూ.230 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది.

Peddi Day 16 Expected Box Office Collection worldwide

విడుదలైన తొలి వారంలోనే 'పెద్ది' భారీ వసూళ్లు నమోదు చేసింది. మొదటి వారం ముగిసే సమయానికి ఇండియన్ బాక్సాఫీస్ వ్దద రూ.194 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించింది. కొన్ని నెగెటివ్ ప్రచారాలు ఎదురైనా, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకుల ఆదరణతో సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతూ రెండో వారంలోకి అడుగుపెట్టింది. 15 రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమా ఇండియాలో రూ.228 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రాస్ పరంగా చూస్తే రూ.270.05 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.204 కోట్ల నెట్ రాబట్టిన ఈసినిమా, కర్ణాటకలో రూ.31 కోట్లు, తమిళనాడులో రూ.6.5 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.30 కోట్లు, కేరళలో రూ.72 లక్షల నెట్ వసూళ్లు సాధించింది.

Recommended For You
Maa Inti Bangaaram Public talk: మా ఇంటి బంగారం పబ్లిక్ టాక్.. సమంత సినిమా ఎలా ఉందంటే?
Maa Inti Bangaaram Public talk: మా ఇంటి బంగారం పబ్లిక్ టాక్.. సమంత సినిమా ఎలా ఉందంటే?

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'పెద్ది' భారీ రెస్పాన్స్ వచ్చింది. 15వ రోజున మరో రూ.15 లక్షల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, విదేశాల్లో మొత్తం రూ.52.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ది 15 రోజుల్లోనే రూ.322.65 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. కొత్త సినిమాల పోటీ మధ్య కూడా 'పెద్ది' స్థిరమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

You May Also Like
దివ్య భారతి మరణం గురించి ముందే హెచ్చరిక.. జ్యోతిష్కుడు ఏం చెప్పారంటే?
దివ్య భారతి మరణం గురించి ముందే హెచ్చరిక.. జ్యోతిష్కుడు ఏం చెప్పారంటే?

పెద్ది 16వ రోజు అంచనా కలెక్షన్స్
'పెద్ది' బాక్సాఫీస్ రన్‌పై షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కాక్‌టెయిల్ 2' ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సినిమా రావడంతో థియేటర్ల సంఖ్యతో పాటు ప్రేక్షకుల దృష్టి కూడా కొంత మేర 'కాక్‌టెయిల్ 2' వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 'పెద్ది' 16వ రోజు వసూళ్లలో మరోసారి స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశముంది. ప్రస్తుత ఆక్యుపెన్సీ, ట్రెండ్‌లను బట్టి శుక్రవారం రోజున ఈ పెద్ది సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.2.10 కోట్ల నుంచి రూ.2.40 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆ సినిమా 'పుష్ప’కి కాపీనా? ధనుష్ డైరెక్టర్ క్లారిటీ!
ఆ సినిమా 'పుష్ప’కి కాపీనా? ధనుష్ డైరెక్టర్ క్లారిటీ!

ఇదిలా ఉంటే.. పెద్ది సినిమా రూ.400 కోట్ల మార్క్ ను దాటేసిందని నిర్మాత, దర్శకులు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. నిర్మాతల లెక్కల ప్రకారం.. 35 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.కొత్త సినిమాల పోటీ మధ్య కూడా 'పెద్ది' తన బాక్సాఫీస్ జోరును కొనసాగించాలంటే ప్రేక్షకుల మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కీలకంగా మారనుంది. రాబోయే రెండు రోజులు ఈ సినిమా బాక్సాఫీస్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X