Peddi Day 19 Box Office: పెద్ది కలెక్షన్లలో భారీ డ్రాప్.. లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే?

Peddi Box Office Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'పెద్ది'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తొలి వారంలో భారీ వసూళ్లు సాధించి , బాక్సాఫీస్ వద్ద సత్తా ఏంటో చాటింది. ఇక రెండో వారం నుంచి కలెక్షన్లు తగ్గడంతో ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. వీకెండ్ లో చెప్పుకోదగ్గ కలెక్షన్లు అందుకున్న వీక్ డేస్ లో మాత్రం వసూలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకూ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? 19వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే..

'పెద్ది' సినిమా దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ మార్కెట్, ఓవర్సీస్ హక్కులు కలిపి ఈ సినిమా సుమారు రూ.220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం, 'పెద్ది' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.230 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. షేర్ లెక్కలను గ్రాస్ కలెక్షన్లుగా మార్చి చూస్తే, దాదాపు రూ.440 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉంది.

Peddi Day 19 Expected Box Office Collection worldwide Ram Charan Film Box Office Report

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ రామ్ చరణ్ స్టార్ పవర్, భారీ ప్రమోషన్స్ కారణంగాయ తొలిరోజు ప్రిమియర్స్ నాడు రూ. 18.5 కోట్లు తొలి రోజు రూ. 47.2 కోట్లు అందుకుంది.ఇలా తొలివారంలో రూ.193.55 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుంది. ఆ తరువాత నుంచి కలెక్షన్లు పడిపోయాయి. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 18వ రోజు 'పెద్ది' అన్ని భాషల్లో కలిపి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.2.82 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 17వ రోజుతో పోలిస్తే సుమారు 44 శాతం పెరుగుదల నమోదైంది.

18 రోజుల్లో 'పెద్ది' సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.234.27 కోట్లకు చేరుకోగా, గ్రాస్ కలెక్షన్లు రూ.276.43 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఓవర్సీర్స లో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న పెద్ది మూవీ రూ.52.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో పెద్ది మొత్తం కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు చేరాయి. కొన్ని ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సంఖ్య రూ.330 కోట్ల మార్క్‌ను కూడా దాటినట్లు తెలుస్తోంది. అయితే రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 67 శాతం పెట్టుబడినే రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇంకా రూ.100 కోట్లకు పైగా రికవరీ లోటు ఉందని అంచనా. దీంతో బాక్సాఫీస్ పరంగా 'పెద్ది' కమర్షియల్ సక్సెస్ సాధించడం కావడం కాస్త కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక 19 రోజు అంచనా కలెక్షన్ల పరిశీలిస్తే.. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' వంటి కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడంతో 'పెద్ది'కి పోటీ మరింత పెరిగింది. ప్రస్తుతం పరిస్థితిలో 19 రోజు కేవలం రూ.1.5 నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీర్ లో కూడా రూ.50లక్షల లోపే వసూలు చేసే అవకావముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.దీంతో ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 236 కోట్లకు, గ్రాస్ వసూళ్లు రూ. 280 కోట్లకు చేరువ కానున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ. 330 కోట్లచేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. పెద్ది ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్ ను దాటేసిందని మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X