Peddi Day 2 Box Office Collections: 150 కోట్లకు చేరువగా పెద్ది.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Peddi Day 2 Expected Box Office

పెద్ది సినిమా పిరియాడిక్ నేచర్ ఉన్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం భారీగా సెట్స్ వేశారు. అందమైన లోకేషన్లలో పాటలు, సన్నివేశాలను చిత్రీకరించారు. పాన్ ఇండియా మూవీ కావడంత పలు భాషలకు సంబంధించిన నటులను ఎంపిక చేశారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారానికి వస్తే.. ఈ చిత్రం ఏపీ, నైజాం ఏరియాల వారీగా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 136 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 17 కోట్ల రూపాయలు, తమిళనాడు 6 కోట్ల రూపాయలు, కేరళ 2 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 34 కోట్ల రూపాయల మేర జరిగింది. టోటల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయల మేర పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 440 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 230 కోట్ల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

పెద్ది సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఆంధ్ర, తెలంగాణలో 55 కోట్ల రూపాయల నెట్, 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం 5.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాలు అంటే నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో కలిపి 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఇండియాలో 70 కోట్ల నెట్, 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని సాక్ నిక్ వెల్లడించింది.

ఓవర్సీస్‌లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో పెద్దికి మంచి ఆదరణ కనిపించింది. ఈ చిత్రం యూకేలో 200K పౌండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 200K ఆస్ట్రేలియన్ డాలర్లు, నార్త్ అమెరికాలో 1.9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో తాజా సమాచారం ప్రకారం.. 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 115 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక రెండో రోజు కూడా పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లను వసూలు చేస్తున్నది. ఈ చిత్రం రెండో రోజు 25 నుంచి 30 కోట్ల మధ్య కలెక్షన్లను నమోదు చేయవచ్చు. దాంతో ఈ సినిమా 150 కోట్ల రూపాయలకు చేరువగా వచ్చే అవకాశం ఉంది. నైట్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగితే ఈ కలెక్షన్ల రేంజ్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X