Peddi Day 20 Collections: భారీగా పడిపోయిన పెద్ది కలెక్షన్స్.. రామ్ చరణ్ మూవీకి 20వ రోజు ఎంతంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ విడుదలై 20 రోజులు కావొస్తోంది. స్పోర్ట్స్, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ రామ్ చరణ్ స్టార్ పవర్‌ను మరోసారి చూపించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ పెద్ది సినిమాను నిర్మించారు. ఈ నేపథ్యంలో 20వ రోజు రామ్ చరణ్ మూవీ ఎంత వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

పెద్ది బడ్జెట్ అండ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
పెద్ది సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు టార్గెట్‌గా రామ్ చరణ్ తన జర్నీని ప్రారంభించారు. పెద్దికి ప్రీమియర్స్ ద్వారా ఇండియాలో 18.50 కోట్ల రూపాయలు వసూలవ్వగా.. తొలి వారం 193.55 కోట్ల రూపాయలతో భారీ విజయం దిశగా దూసుకెళ్లింది పెద్ది. అయితే అనూహ్యంగా సెకండ్ వీక్ నుంచి రామ్ చరణ్ మూవీ వసూళ్లను కోల్పోతూ వచ్చింది. రెండో వారంలో పెద్ది కేవలం 34.55 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది.

Peddi Day 20 Expected Box Office Collection worldwide Ram Charan Film witnessed huge drop

పెద్ది 19 రోజుల కలెక్షన్స్
మూడో వారంలోనూ పెద్దికి దారుణంగా వసూళ్లు వచ్చాయి. పదహారవ రోజున 1.50 కోట్ల రూపాయలు, పదిహేడో రోజున 1.95 కోట్ల రూపాయలు, పద్దెనిమిదో రోజున 2.82 కోట్ల రూపాయలు, పందొమ్మిదో రోజున 83 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 235 కోట్ల రూపాయల నెట్.. 278 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు పెద్దికి తమిళనాడులో 6.32 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 31.20 కోట్ల రూపాయలు, కేరళలో 57 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30.52 కోట్ల రూపాయలు రాబట్టింది. నైజాంలో 86.15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 30.15 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 103.15 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 219.65 కోట్ల రూపాయల గ్రాస్.. 130.52 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది పెద్ది.

పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో రామ్ చరణ్ మూవీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మా ఇంటి బంగారం, కాక్‌టెయిల్ 2, మై వాపస్ అవుంగా, బాలన్ తదితర చిత్రాలు విడుదల కావడం పెద్ది బుకింగ్స్‌పై ప్రభావం చూపింది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 3.50 మిలియన్ డాలర్లు (33.15 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు పెద్ది మూవీకి 53 కోట్ల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ పేర్కొంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి పెద్ది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 331 కోట్ల రూపాయలు గ్రాస్.. 170 కోట్ల రూపాయల షేర్ ఆర్జించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే పెద్ది ఇప్పటికే 400 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ వృద్ధి సినిమాస్ ప్రకటించింది.

పెద్ది 20వ రోజు వసూళ్ల అంచనా
వర్కింగ్ డేస్‌కి తోడు, థియేటర్స్‌లో కొత్త సినిమాల రాకతో పెద్ది బుకింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. 20వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో 642 షోలు ప్రదర్శితమై.. 17 శాతం మాత్రమే ఆక్యూపెన్సీ సాధించినట్లు సాక్‌నిక్ పేర్కొంది. దాంతో నైట్ షోలపైనే చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది. పెద్ది మూవీ మంగళవారం వరల్డ్ వైడ్‌గా 75 లక్షల రూపాయల రేంజ్‌లో వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పెద్దిని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా.. బడ్జెట్ పరంగా 95 శాతం మేర రికవరీని సాధించింది. అయితే ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా రామ్ చరణ్ మూవీ మరో 60 కోట్ల రూపాయలు రాబడితే క్లీన్‌హిట్ ఇమేజ్ దక్కించుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X