Peddi Day 21 Collections: పెద్దికి మా ఇంటి బంగారం దెబ్బ.. రామ్ చరణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ 21వ రోజుకు చేరుకుంది. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమా బుధవారంతో మూడో వారం పూర్తి చేసుకుని రేపటి నుంచి నాలుగో వారంలోకి అడుగుపెట్టనుంది పెద్ది. ఈ నేపథ్యంలో 21వ రోజు పెద్ది మూవీ వరల్డ్ వైడ్‌గా ఎంత రాబట్టింది? అనేది పరిశీలిస్తే..

పెద్ది బడ్జెట్
పెద్ది సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. 450 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌తో రామ్ చరణ్ తన బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించారు. పెద్ది తొలి వారం ఇండియాలో 193.55 కోట్ల రూపాయలు వసూలు చేసి రామ్ చరణ్ స్టార్ పవర్‌ను చాటి చెప్పింది. కానీ ఈ సంతోషం రెండో వారం నాటికే ఆవిరైంది. సెకండ్ వీకెండ్‌లో కేవలం 34.45 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది.

Peddi Day 21 Expected Box Office Collection worldwide Ram Charan Film Faces challenge from Maa Inti Bangaram

పెద్దికి మా ఇంటి బంగారం ఎఫెక్ట్
మూడో వారంలోకి ప్రవేశించిన తర్వాత పెద్దికి కొత్త సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. వీకెండ్ కావడంతో తొలి మూడు రోజులు 8 కోట్ల రూపాయల వరకు రాబట్టినప్పటికీ.. సోమవారం నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సోమవారం 83 లక్షల రూపాయలు, మంగళవారం 80 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది పెద్ది. ఇప్పటి వరకు భారత్‌లో పెద్ది చిత్రం 235 కోట్ల రూపాయల నెట్.. 279 కోట్ల రూపాయలు గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు సాక్‌నిక్ చెబుతోంది.

పెద్దికి ఇండియాలో కలెక్షన్స్
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 226.48 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 31.20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.32 కోట్ల రూపాయలు, కేరళలో 57 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30.52 కోట్ల రూపాయలు వసూలు చేసింది పెద్ది. ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో పెద్ది ప్రస్థానం దాదాపు ముగిసినట్లుగానే కనిపిస్తోంది. కొత్త సినిమాలు మా ఇంటి బంగారం, కాక్‌టెయిల్ 2, మై వాపస్ అవుంగా తదితర చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దాంతో ఇక్కడ పెద్దికి భారీ నష్టాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్
సోమవారం పెద్ది మూవీకి అత్యల్పంగా కేవలం 1000 డాలర్లు మాత్రమే వచ్చాయంటే పరిస్దితిని అర్ధం చేసుకోవచ్చు. నార్త్ అమెరికాతో పాటు విదేశాలలో కలిపి ఓవర్సీస్‌లో పెద్దికి ఇప్పటి వరకు 5.35 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 52 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్‌ కలుపుకుంటే రామ్ చరణ్ మూవీకి ఇప్పటి వరకు గ్లోబల్ వైడ్‌గా 334 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే తమ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

పెద్ది 21వ రోజు వసూళ్లు అంచనా
21వ రోజు కూడా రామ్ చరణ్ మూవీకి బుకింగ్స్ ఏ మాత్రం పుంజుకోలేదు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దికి ఇండియా వైడ్‌గా కేవలం 656 షోలు ప్రదర్శితమై 10 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ వంటి పెద్ద సెంటర్స్‌ మాత్రమే పెద్దిని ఆదుకుంటున్నాయి. రూరల్, పట్టణ ప్రాంతాల్లో మా ఇంటి బంగారం హవా చూపిస్తోంది. బుధవారం పెద్ది మూవీకి వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల రేంజ్‌లో వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పెద్దికి ఇంకెంత రావాలంటే?
తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లు సాధించగా.. నాన్ తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో మాత్రం పెద్ది నష్టాల దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓవరాల్‌గా థియేట్రికల్ బిజినెస్ ప్రకారం చూసుకుంటే పెద్ది సినిమా లాభాల్లోకి రావాలంటే 225 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ 175 కోట్ల రూపాయల రేంజ్‌లో షేర్ మాత్రమే వసూలు చేసింది. క్లీన్ హిట్ కావాలంటే మరో 50 కోట్ల రూపాయల షేర్ కొట్టాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే వీకెండ్ తర్వాత పెద్ది మూవీ థియేట్రికల్ రన్‌పై క్లారిటీ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X