Peddi Day 22 Collections: భారీగా పడిపోయిన పెద్ది కలెక్షన్స్.. రామ్ చరణ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, జాన్వీకపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీ విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు జోరు చూపించిన చరణ్‌కు ఈ వారం సమంత నటించిన మా ఇంటి బంగారం రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. అయినప్పటికీ సినిమాను తన ఛరిష్మా మీద నడిపిస్తున్నాడు రామ్ చరణ్. ఈ నేపథ్యంలో 22వ రోజు పెద్ది మూవీకి ఎంత వసూలైంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ఇంకా ఎంత రాబట్టాలి అనేది పరిశీలిస్తే...

రామ్ చరణ్ మూవీ ఇండియాలో తొలి వారం 193.55 కోట్లు రాబట్టగా, రెండో వారంలో 34.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ మూడో వారంలో పెద్దికి కొత్త సినిమాల నుంచి గట్టి దెబ్బ తగిలింది. దీంతో కనీసం 10 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మూడో వారం 8.60 కోట్ల రూపాయల నికర వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా మూడు వారాలు ముగిసేసరికి ఇండియాలో 236.86 కోట్ల రూపాయల నెట్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ లెక్కలు చెబుతున్నాయి.

Peddi Day 22 Expected Box Office Collection worldwide Ram Charan Film faces struggles

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 227.76 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 31.30 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.32 కోట్ల రూపాయలు, కేరళలో 57 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30.64 కోట్ల రూపాయలు వసూలు చేసింది పెద్ది. అయితే చాలా ఏరియాలలో పెద్ది ఆశించిన రిజల్ట్ రాబట్టలేదు. నార్త్‌లో భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ హిందీ ప్రేక్షకులు రామ్ చరణ్ మూవీని లైట్ తీసుకున్నారు. అక్కడ 100 కోట్ల రూపాయలు సాధిస్తుందని మేకర్స్ భావించగా.. 30 కోట్లకే పరిమితమైంది. హిందీలో 25 కోట్ల రూపాయల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరగ్గా బ్రేక్ఈవెన్ కావాలంటే 50 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసి 15 కోట్ల రూపాయల లోటుతో నడుస్తోంది పెద్ది.

పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్
అటు ఓవర్సీస్‌లోనూ పెద్ది ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లుగానే కనిపిస్తోంది. బుధవారం నార్త్ అమెరికాలో కేవలం 3000 డాలర్లు (28 లక్షల రూపాయలు) మాత్రమే రాబట్టగలిగింది. అక్కడ కూడా మా ఇంటి బంగారం, కాక్‌టెయిల్ 2 తదితర సినిమాల దెబ్బ పెద్దిపై పడింది. మిగిలిన దేశాలలోనూ పరిస్ధితి ఆశాజనకంగా లేదు. ఓవర్సీస్‌ మార్కెట్‌లో పెద్దికి 40 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. బ్రేక్‌ఈవెన్ కావాలంటే 80 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 53 కోట్ల రూపాయల వద్ద పెద్ది కొనసాగుతుండగా.. బ్రేక్‌ఈవెన్‌కు మరో 17 కోట్ల రూపాయల దూరంలో ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ పరిస్ధితి చూస్తే టార్గెట్ కొట్టేలా కనిపించడం లేదు. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి పెద్ది వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 333 కోట్ల రూపాయల గ్రాస్.. 180 కోట్ల రూపాయల షేర్ ఆర్జించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పెద్ది 22వ రోజు వసూళ్ల అంచనా
పెద్ది జైత్రయాత్ర దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. అయితే రోజుకు కోటి రూపాయల గ్రాస్ రాబడుతూ తన మార్క్ చూపిస్తున్నాడు రామ్ చరణ్. 22వ రోజు పెద్ది మూవీకి ఇండియాలో సాయంత్రం 5 గంటల వరకు 945 షోలు ప్రదర్శితమై 26 లక్షల రూపాయల నికర వసూళ్లు సాధించినట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. ట్రెండ్స్‌ను బట్టి పెద్దికి 22వ రోజున వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయలకు పైగా నికర వసూళ్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే తమ చిత్రం 400 కోట్ల రూపాయల మార్క్ అందుకుందని నిర్మాణ సంస్ధ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే పెద్ది ఓవరాల్‌గా 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబట్టినట్లే. అలా చూసినా రామ్ చరణ్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే ఇంకా 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. మా ఇంటి బంగారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ.. ఈ శుక్రవారం తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో పెద్ది మెరుగైన వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు. మరి రామ్ చరణ్ - బుచ్చిబాబుల స్పోర్ట్స్ డ్రామా భవిష్యత్తు ఏంటనేది ఈ వీకెండ్‌తో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X