Peddi Day 23 Collections: వీకెండ్‌పైనే పెద్ది ఆశలు... రామ్ చరణ్ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించగా బుచ్చిబాబు సానా దర్వకత్వం వహించారు. జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో పెద్ది ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది. 23వ రోజు వసూళ్లు ఎంత అనేది పరిశీలిస్తే..

పెద్ది 22 రోజుల కలెక్షన్స్
పెద్ది మూవీకి వరల్డ్ వైడ్‌గా 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమాల లాభాల్లోకి రావాలంటే 225 కోట్ల రూపాయల షేర్, 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. రామ్ చరణ్ మూవీకి తొలివారం 193.55 కోట్ల రూపాయలు, రెండో వారం 34.45 కోట్ల రూపాయలు, మూడో వారంలో 9.37 కోట్ల రూపాయల చొప్పున 22 రోజుల వరకు 237 కోట్ల రూపాయల నెట్.. 281 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

Peddi Day 23 Expected Box Office Collection worldwide Ram Charan Film eyes on weekend

వివిధ రాష్ట్రాలలో పెద్ది కలెక్షన్స్
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 228.85 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 31.40 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.32 కోట్ల రూపాయలు, కేరళలో 57 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30.73 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భాషాల వారీగా చూస్తే తెలుగు వెర్షన్‌లో 265.75 కోట్ల రూపాయలు, హిందీలో 26.98 కోట్ల రూపాయలు, తమిళ్‌లో 2.50 కోట్ల రూపాయలు, కన్నడంలో 2.39 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు.

ఓవర్సీస్‌లో పెద్ది కలెక్షన్స్
ఓవర్సీస్‌లో పెద్ది ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లేనని చెబుతున్నారు. నార్త్ అమెరికాలో అయితే సింగ్ గీతం మూవీ స్థాయికి పెద్ది పడిపోయింది. మంగళవారం ఈ రెండు సినిమాలకు చెరో 3 వేల డాలర్లు రాగా.. బుధవారం పెద్దికి వెయ్యి డాలర్లు వస్తే, సింగ్ గీతం మూవీకి 2 వేల డాలర్లు వసూలైందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నార్త్ అమెరికాలో రామ్ చరణ్ మూవీకి ఇప్పటి వరకు 3.50 మిలియన్ డాలర్లు (33 కోట్ల రూపాయలు) వసూలవ్వగా.. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, సింగపూర్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 5.35 మిలియన్ డాలర్లు (53 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్‌తో పెద్దికి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 334 కోట్ల రూపాయల గ్రాస్.. 181 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది పెద్ది.

23వ రోజు వసూళ్లు అంచనా
ఇప్పటికే మా ఇంటి బంగారం నుంచి పెద్ది గట్టి పోటీ ఎదుర్కొంటూ ఉండగా.. శుక్రవారం మరికొన్ని చిన్నా పెద్దా సినిమాలు పోటీకి వచ్చాయి. అయినప్పటికీ రామ్ చరణ్ తన ఛరిష్మాతో సినిమాను నడిపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటంతో పెద్ది మెరుగైన ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా పడిపోతూ వస్తున్న బుకింగ్స్... ఈ రోజు మాత్రం పెద్ది టీమ్‌కి కాస్త ఊరట కలిగిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఇండియాలో 626 షోలు ప్రదర్శితమై.. 51 లక్షల రూపాయల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. శుక్రవారం పెద్ది మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 50 లక్షల రూపాయలు కోటి 50 లక్షల రూపాయలు వసూలవుతుందని భావిస్తున్నారు.

పెద్ది 400 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టిందని నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. అలా చూస్తే.. డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా రామ్ చరణ్ మూవీ 20 కోట్ల రూపాయలకు పైగా రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పెద్ది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్రేక్ఈవెన్ మార్క్ క్రాస్ చేసి బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది. కర్ణాటకలో 93 శాతం రికవరీ సాధించి స్వల్ప నష్టాలను ఎదుర్కొంది. కానీ తమిళనాడు, కేరళ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో మాత్రం పెద్ది ఫ్లాప్ అయ్యింది. గత వారం రోజులుగా పెద్ది దూకుడు తగ్గింది. దీనిని బట్టి చూస్తే ఈ వీకెండ్ తర్వాత రామ్ చరణ్ మూవీ నిలబడటం కష్టమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి ఫైనల్‌గా పెద్ది జర్నీ ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X