Peddi Day 24 Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు.. 24రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే?

Peddi Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబో తెరకెక్కిన సినిమా 'పెద్ది'. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు. రామ్ చరణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమాల లాభాల్లోకి రావాలంటే 225 కోట్ల రూపాయల షేర్, 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది. 24వ రోజు వసూళ్లు ఎంత అనేది పరిశీలిస్తే..

పెద్ది మూవీ మొదటి వారం భారీ వసూళ్ల రాబట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కానీ, క్రమంగా కలెక్షన్లు తగ్గుతు వచ్చాయి. ఇలా పెద్ది 23 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 238.30 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు అందుకోగా, 281.85 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 52.90 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దీంతో పెద్ది సినిమా ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు మొత్తం 334.75 కోట్ల రూపాయలు చేరింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచే 211.69 కోట్ల రూపాయల నెట్ రావడం విశేషం. హిందీ వెర్షన్ 22.45 కోట్ల రూపాయలు, తమిళం 2 కోట్ల రూపాయలు, కన్నడ 1.86 కోట్ల రూపాయలు, మలయాళం 30 లక్షల రూపాయల నెట్ మాత్రమే వసూలు చేశాయి.

Peddi day 24 expected box office collection worldwide ram charan film eyes on weekend

రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో 215.50 కోట్ల రూపాయల గ్రాస్, కర్ణాటకలో 29.73 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.43 కోట్ల రూపాయలు, కేరళలో 72 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 29.47 కోట్ల రూపాయల గ్రాస్ నమోదైంది. నాలుగో వారంలోకి వచ్చిన తర్వాత సినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయి. 23వ రోజు కేవలం 1.05 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే అందుకుంది. పెద్ది కలెక్షన్లపై సమంత సినిమా ఎఫెక్ట్ ఉందనే చెప్పాలి. 'మా ఇంటి బంగారం' రెండో వీకెండ్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తూ థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఆ సినిమావైపు మొగ్గు చూపడం వల్ల 'పెద్ది' వసూళ్లపై ప్రభావం పడిందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

24 రోజు అంచనా కలెక్షన్లు
ఇక 24వ రోజు (నాలుగో శనివారం) కూడా సినిమా తన రన్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 షోలలో ప్రదర్శితమవుతుంది 'పెద్ది', ఈ సినిమా మధ్యాహ్నం వరకు 16 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ప్రస్తుతం వీకెండ్ కావడంతో సాయంత్రం, రాత్రి షోలకు ప్రేక్షకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే 24వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1.50 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీర్ లో మరో 50 లక్షలు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల మార్క్ వైపు అడుగులు వేయనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. పెద్ది 400 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టిందని నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. అలా చూస్తే. పెద్ది' థియేట్రికల్ బిజినెస్ సుమారు 220 కోట్ల రూపాయలు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం, సినిమా ఇంకా పూర్తి స్థాయి బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోవాలంటే 20 కోట్ల రూపాయలకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్రేక్‌ఈవెన్ సాధించి బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకున్న ఈ సినిమా, కర్ణాటకలో దాదాపు 93 శాతం రికవరీ సాధించింది. అయితే తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో అక్కడ నష్టాలు తప్పలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత వారం నుంచి కలెక్షన్లు క్రమంగా తగ్గుతుండటంతో, ఈ వీకెండ్ తర్వాత సినిమా రన్ మరింత నెమ్మదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో 'పెద్ది' ఫైనల్ బాక్సాఫీస్ రన్ ఎక్కడ ముగుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X