Peddi Day 27 Collections: పెద్ది‌కి లాస్ట్ ఛాన్స్. రామ్ చరణ్ మూవీకి ఇంకా ఎంత రావాలంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది మూవీ థియేట్రికల్ రన్ దాదాపుగా చివరికి చేరుకున్నట్లేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. జూన్ 4న భారీ అంచనాల నేపథ్యంలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించిన పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే 3 వారాలు పూర్తి చేసుకున్న పెద్ది.. బుధవారంతో 4 వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ మూవీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 27వ రోజు వరల్డ్ వైడ్‌గా ఎంత వసూలు చేసింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

పెద్ది బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
పెద్ది మూవీకి వరల్డ్ వైడ్‌గా 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 225 కోట్ల రూపాయల షేర్, 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇండియాలో ప్రీమియర్స్‌ ద్వారా 18.50 కోట్ల రూపాయలు వసూలు చేసిన పెద్ది.. తొలి వారం ఏకంగా ఇండియాలో 193.55 కోట్ల రూపాయల నెట్ రాబట్టి భారీ టార్గెట్ దిశగా దూసుకెళ్లింది. కానీ రెండో వారం వచ్చేసరికి పెద్ది చతికిలపడింది. కేవలం 34.45 కోట్ల రూపాయల నికర వసూళ్లతో రెండో వారం షాకిచ్చింది.

Peddi Day 27 Expected Box Office Collections Worldwide Ram Charan Film facing to recover its complete budget

పెద్ది 26 రోజుల కలెక్షన్స్
మూడో వారం కొత్త సినిమాల రాక, పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తెరచుకోవడంతో పెద్ది కలెక్షన్స్‌ను కోల్పోయింది. మూడో వారం రామ్ చరణ్ మూవీ 9.27 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. సమంత నటించిన మా ఇంటి బంగారం ఎఫెక్ట్‌తో బుకింగ్స్, కలెక్షన్స్ పడిపోయాయి. దాంతో నాలుగో వారంలోనూ పెద్ది పుంజుకోలేకపోయింది. ఇరవై మూడో రోజున 93 లక్షల రూపాయలు, ఇరవై నాలుగో రోజున 80 లక్షల రూపాయలు, ఇరవై ఐదో రోజున 1.04 కోట్ల రూపాయలు, ఇరవై ఆరో రోజున 35 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. దాంతో ఇప్పటి వరకు ఇండియాలో 240.49 కోట్ల రూపాయల నెట్.. 284.35 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

వివిధ రాష్ట్రాల్లో పెద్ది కలెక్షన్స్
25 రోజుల వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 233.20 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 31.65 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.32 కోట్ల రూపాయలు, కేరళలో 57 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30.83 కోట్ల రూపాయలు రాబట్టింది. భాషలపరంగా చూస్తే తెలుగులో 270.38 కోట్ల రూపాయలు, హిందీలో 27 కోట్ల రూపాయలు, తమిళంలో 2.50 కోట్ల రూపాయలు, కన్నడంలో 2.39 కోట్ల రేపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఓవర్సీస్‌లో పెద్దికి నష్టాలు
నార్త్ అమెరికా సహా ఓవర్సీస్‌లో పెద్ది మూవీ జర్నీ ఇప్పటికే ముగిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ మూవీకి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 5.35 మిలియన్ డాలర్లు (భారత కరెన్నీలో 52.85 కోట్ల రూపాయలు) మాత్రమే వసూలు చేయగలిగింది. పెద్దికి ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. అక్కడ బ్రేక్ఈవెన్ కావాలంటే 80 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు థియేట్రికల్ బిజినెస్‌ను పరిశీలిస్తే పెద్ది ఓవర్సీస్‌లో బ్రేక్ఈవెన్ మార్క్‌ను చేరుకోలేదక దాదాపు 18 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. ఓవర్సీస్ కలెక్షన్స్‌తో కలిపి పెద్దికి వరల్డ్ వైడ్‌గా 337.25 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. అయితే తమ చిత్రం వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వృద్ధి సినిమాస్ ప్రకటించింది.

పెద్ది 27వ రోజు వసూళ్ల అంచనా
రామ్ చరణ్ మూవీ జైత్రయాత్ర బాక్సాఫీస్ వద్ద దాదాపుగా ముగిసినట్లుగానే కనిపిస్తోంది. గత వారాంతంలో ఇండియాలో 3 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టిన పెద్దికి సోమవారం నుంచి మళ్లీ కలెక్షన్స్ పడిపోయాయి. నాలుగో సోమవారం ఈ సినిమాకు ఇండియాలో కేవలం 35 లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చిందంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. 27వ రోజు సాయంత్రం 5 గంటల వరకు పెద్దికి ఇండియాలో 678 షోలు మాత్రమే ప్రదర్శితమై కేవలం 16 లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది. రామ్ చరణ్ మూవీకి మంగళవారం వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల గ్రాస్ రావొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

డిస్ట్రిబ్యూషన్ పరంగా పెద్ది లాభాల్లోకి రావాలంటే 225 కోట్ల రూపాయల షేర్.. 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. అయితే సాక్‌నిక్ లెక్కల ప్రకారం రామ్ చరణ్ మూవీ వరల్డ్ వైడ్‌గా 337.25 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి 110 కోట్ల రూపాయలకు పైగా వెనుకబడి ఉంది. ఇప్పటికే మా ఇంటి బంగారం నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న పెద్దికి ఈ వారం నాగబంధం, రావు బహదూర్ వంటి పెద్ద సినిమాలతో మరిన్ని కష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X