Peddi Day 3 Box Office Collections: 200 కోట్ల క్లబ్‌లో పెద్ది.. బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న రాంచరణ్
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

పెద్ది చిత్రం రాష్ట్రాల వారీగా, భాషల వారీగా వసూలు చేసిన కలెక్షన్ల వివారాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణలో తొలి రోజు 48 కోట్ల రూపాయలు, రెండో రోజు 25 కోట్ల రూపాయలతో 73 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో తొలి రోజు 5.75 కోట్ల రూపాయలు, 3.25 కోట్ల రూపాయలు రాబట్టింది. కేరళలో తోలి రోజు 25 లక్షలు, రెండో రోజు 10 లక్షల రూపాయలు, తమిళనాడులో తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 5.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
పెద్ది చిత్రం గత రెండు రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రీమియర్ల ద్వారా 19 కోట్ల రూపాయల నెట్ 22 కోట్ల గ్రాస్, తొలి రోజు 51 కోట్ల నెట్, 61 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 27 కోట్ల నెట్, 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 87 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇండియాలో ఈ చిత్రం సుమారుగా 96.5 కోట్ల నెట్ కలెక్షన్లు.. 114.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రాంచరణ్ మూవీకి ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు కలిపి 1.93 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అమెరికాలో 1.56 మిలియన్ డాలర్లు, కెనడాలో 155k డాలర్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ చిత్రం 300K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 2.3 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కలిపి ఈ చిత్రం సుమారుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ప్రత్యాంగీరా సినిమాస్ తెలిపింది.
ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ఫ్రకారం.. ఈ చిత్రం ఇండియాలో 155 కోట్ల రూపాయల మేర వసూళ్లు సాధించింది అని సమాచారం. అయితే ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్, ప్రత్యాంగీరా అధికారికంగా 181 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని వెల్లడించారు. ట్రేడ్, చిత్ర యూనిట్ వెల్లడించిన లెక్కల్లో 26 కోట్ల రూపాయల మేర తేడా కనిపిస్తున్నది.
ఇక మూడో రోజు అంటే శనివారం కూడా కూడా పెద్ది స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ డ్రాప్ కనిపిస్తున్నది. ఈ చిత్రం రెండో రోజు కంటే తక్కువగానే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం సుమారుగా 45 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నది. నైట్ షోలకు రెస్సాన్స్ భారీగా పెరిగితే.. ఈ చిత్రం 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఇండియాలో, 18 నుంచి 20 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్‌గా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందింది అని దర్శకుడు బుచ్చిబాబు సనా వెల్లడించారు. ఈ సినిమా టోటల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయల మేర పూర్తయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 440 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 230 కోట్ల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ చిత్రం 200 కోట్ల రూపాయల గ్రాస్‌తో సుమారుగా 50 శాతం రికవరీని సాధించింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు లాభాలను పంచిపెడుతుందనేది వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications




