Peddi Day 4 Box Office Collections: 300 కోట్లకు చేరువగా పెద్ది.. మాస్ బ్యాటింగ్‌తో రాంచరణ్ ట్రిపుల్ సెంచరీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన పరిస్థితులతో కలెక్షన్ల జర్నీని కొనసాగిస్తున్నది. అపరిపక్వతతో కూడిన బుచ్చిబాబు టేకింగ్, జాన్వీ కపూర్ అందచందాల ప్రదర్శన వివాదాలు కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యమే చెల్లించుకొనే ప్రమాదంలో పడింది. అయితే మిగితా రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో పరిస్థితి ఎలా ఉన్నా మెగా హీరోకు సినీ ప్రేక్షకుల నుంచి ఆంద్రా, నైజాంలో అండగా నిలిచారనే విషయం తాజా వసూళ్లతో స్పష్టమైంది. ఈ చిత్రం గత 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పెద్ది సినిమా ప్రీమియర్లకు స్వదేశం, విదేశాల్లో భారీ స్పందన కనిపించింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 63 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ప్రీమియర్ల విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో 18 కోట్ల రూపాయలు, ఇండియాలో 20 కోట్ల రూపాయల గ్రాస్, మొత్తంగా 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Peddi Day 4 Box Office Collections

పెద్ది ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో తొలి రోజు కూడా హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 67 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు, హిందీ మార్కెట్‌లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంత తొలి రోజు 77 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 115 కోట్లకుపైగా వసూళ్లను తొలి రోజు సాధించింది.

ఇక రెండో రోజు దాదాపు 45 శాతానికిపైగా డ్రాప్ కనిపించినా.. ఈ సినిమా స్టడీగా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకొన్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు, హిందీలో 2.5 కోట్ల రూపాయలతో కలిపి ఇండియాలో 32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 155 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించగా.. 181 కోట్ల రూపాయలు రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉండగా, పెద్ది చిత్రం మూడో రోజు అంటే శనివారం కూడా నిలకడగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో 2 కోట్ల రూపాయలు, తెలుగులో 13 కోట్ల రూపాయలు, మిగితా ప్రాంతాల్లో 14 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 190 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. అయితే ఈ చిత్రం 230 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటి వరకు భాషలు, రాష్ట్రాల వారీగా పెద్ది వసూళ్లను చూస్తే.. ఏపీ, తెలంగాణలో 100 కోట్లకుపైగా నెట్, తమిళనాడులో 3.5 కోట్ల నెట్, కర్ణాటకలో 13.5 కోట్ల నెట్, కేరళలో 42 లక్షలు నెట్, నార్త్ ఇండియాలో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 127 కోట్ల రూపాయల నెట్ సాధించింది. ఓవర్సీస్‌లో 42 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక పెద్ది నాలుగో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా భారీగానే వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం ఇండియాలో 30 నుంచి 35 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో మరో 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 40 నుంచి 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. నిర్మాతల లెక్కల ప్రకారం ఈ సినిమా 275 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ చిత్రం నైట్ షోలకు డిమాండ్ పెరిగితే.. 300 కోట్లకు చేరువగా కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది అనే అంచనాతో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X