Peddi 5 days AP-TG collections: ‘పెద్ది' జోరుకు బ్రేక్ ? రామ్ చరణ్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు!

Peddi collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన సినిమా పెద్ది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద తొలి నాలుగు రోజులు అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్లింది. అయితే వీకెండ్ ముగియడంతో పాటు సాధారణంగా వచ్చే వర్కింగ్ డే ప్రభావం ఈ సినిమాపై కూడా కనిపించింది. సోమవారం (జూన్ 8) నాటికి 'పెద్ది' కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో పెద్ది కలెక్షన్లు ఎంత? తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకెళ్తే..

పెద్ది కలెక్షన్లు వీకెండ్ దుమ్మురేపినా.. వీక్ డేస్ వచ్చే సరికి కలెక్షన్స్ తగ్గాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'పెద్ది' ఐదో రోజు దేశవ్యాప్తంగా సుమారు రూ.12.09 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. వీకెండ్‌లో నమోదైన భారీ వసూళ్లతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం వరకు తగ్గుదలగా చెప్పవచ్చు. అయినప్పటికీ ఒక వర్కింగ్ డేలో ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషమనే చెప్పాలి. ఐదు రోజుల 'పెద్ది' కలెక్షన్లు చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.169.70 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ.201.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఈ సంఖ్యలు రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్ దిశగా సినిమా సాగుతోందని సూచిస్తున్నాయి.

Peddi Day 5 AP TG Collections Ram Charan Film Nears 250 Cr Despite Monday Drop

ఇక ఓవర్సీర్ విషయానికి వస్తే, తొలి నాలుగు రోజుల్లో మంచి వసూళ్లు సాధించిన 'పెద్ది'కి సోమవారం మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఐదో రోజు ఓవర్సీస్‌లో సుమారు రూ.1 కోటి గ్రాస్ మాత్రమే వసూలైంది. దీంతో ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు రూ. 47 కోట్లకు ( 18.88 శాతం) చేరుకున్నాయి. దీంతో 'పెద్ది' ఐదు రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు రూ.248.92 కోట్లకు చేరాయి. దీంతో రూ.250 కోట్ల మార్క్‌ను అందుకోవడానికి సినిమా కేవలం అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం వసూళ్లతో ఈ మైలురాయిని సులభంగా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ భారీ కలెక్షన్లలో తెలుగు రాష్ట్రాల వాటానే అత్యధికం అని చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటివరకు రూ.169.70 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. అందులో ఒక తెలుగు వెర్షన్ లోనే రూ.153.90 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'పెద్ది'కి భారీ ఆదరణ లభిస్తోంది. రోజువారీ వసూళ్ల విషయానికి వస్తే.. ప్రీమియర్ లో పెద్ది రూ.18.50 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత తొలి రోజు ఏకంగా రూ.47.20 కోట్ల నెట్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రెండో రోజు రూ.24.20 కోట్లు, మూడో రోజు రూ.25.85 కోట్లు, నాలుగో రోజు రూ.27.75 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ మొత్తం అద్భుతమైన వసూళ్లను నమోదు చేసిన ఈ సినిమా.. సోమవారం నుంచి సాధారణ వర్కింగ్ డే ప్రభావాన్ని ఎదుర్కొంది.

ఐదో రోజు అయిన సోమవారం తెలుగు వెర్షన్ నుంచి రూ.10.40 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. వీకెండ్‌తో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదలే అయినప్పటికీ, ఒక వర్కింగ్ డేలో డబుల్ డిజిట్ వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. ఇతర భాషల్లో వసూళ్లు కాస్త మందగించినా, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో ప్రేక్షకుల స్పందన బలంగానే కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నంలో సోమవారం కూడా 57 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. కాకినాడలో 49.5 శాతం, విజయవాడలో 40.3 శాతం, హైదరాబాద్‌లో 32.5 శాతం ఆక్యుపెన్సీ నమోదవడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. వీక్‌డేస్‌లో కూడా ఈ స్థాయి ఆక్యుపెన్సీ కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో 'పెద్ది' రూ.300 కోట్ల క్లబ్‌లోకి సులభంగా ఎంట్రీ ఇవ్వొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X