Peddi Day 5 Box Office Collections: పెద్ది బాక్సాఫీస్ ట్రిపుల్ సెంచరీ.. నెగిటివ్ టాక్‌లోను రాంచరణ్ కలెక్షన్ల క

పాన్ ఇండియా వైడ్‌గా వివాదాలు, సంచలనాల నమోదు చేసుకొంటూ పెద్ది చిత్రం బాక్సాఫీస్ జర్నీని కొనసాగిస్తున్నది. రాంచరణ్, బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రీమియర్లతో ఘనంగా రిలీజైంది. అయితే ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలను ఎదురిస్తూ తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. కేరళ, తమిళనాడు, నార్త్ ఇండియాలో బాక్సాఫీస్‌ను ప్రభావం చూపలేకపోయింది. అయినప్పటికీ ఈ చిత్రం ఓవర్సీస్‌లో మధ్యస్తంగా రాణిస్తూ 300 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్దమైంది. ఈ చిత్రం గత 4 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం 5వ రోజు ఎంత వసూలు చేయవచ్చనే అంచనా వివరాల్లోకి వెళితే..

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన పెద్ది చిత్రం భారీ తారాగాణం, సెట్స్, రిచ్ లోకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. అలాగే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వాల్యూ సుమారుగా 220 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ మూవీ సుమారుగా 230 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కలెక్షన్ల యాత్రను మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Peddi Day 5 Expected Box Office

ఇండియాలో ఈ సినిమా గత 4 రోజుల్లో వివిధ భాషల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు నేషనల్ బాక్సాఫీస్ వద్ద 61 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు 32 కోట్ల రూపాయల నెట్, మూడో రోజు 35 కోట్ల రూపాయల నెట్, నాలుగో రోజు 38 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 166 కోట్లకుపైగా నెట్, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పెద్ది చిత్రం ఓవర్సీస్‌లో స్టడీగా కలెక్షన్లను రాబడుతున్నదని ఈ సినిమాను పంపిణీ చేసిన ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా వివిధ దేశాల్లో వసూలు చేసిన వివరాలను అందించింది. యూకే, ఐరాండ్ దేశాల్లో ఈ చిత్రం గత 3 రోజుల్లో 325000 పౌండ్లను అంటే ఇండియన్ కరెన్సీలో 41.5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక గల్ఫ్ దేశాల్లో ఈ మూవీ 574414 అమెరికన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 5.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి దేశాల్లో 450k ఆస్ట్రేలియన్ డాలర్లను అంటే ఇండియన్ కరెన్సీలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక అమెరికాలో ఈ సినిమా భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 3 మిలియన్ డాలర్లు అంటే 29 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ప్రత్యాంగీరా సినిమాస్ తెలిపింది. అంటే ఈ సినిమా ఓవర్సీస్‌లో అన్ని ప్రాంతాలను కలుపుకొని 46 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని పేర్కొన్నది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 246 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది ట్రేడ్ వర్గాలు తెలిపితే.. చిత్ర యూనిట్ మాత్రం గత నాలుగు రోజుల్లో 292 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అధికారికంగా వెల్లడించింది.

ప్రతీ సినిమాకు అగ్ని పరీక్షగా మారే సోమవారం కూడా పెద్ది సినిమా స్గ్రాంగ్‌గా కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 12 నుంచి 15 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌తో కలిపి 15 నుంచి 18 వరకు వసూళ్లను రాబట్ట వచ్చు. దాంతో ఈ సినిమా 310 నుంచి 215 కోట్ల మధ్య సెటిల్ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X