Peddi Day 6 Box Office Collections: జోరు తగ్గిన పెద్ది బాక్సాఫీస్ బ్యాటింగ్.. రాంచరణ్ మూవీ కలెక్షన్లు ఎన్ని కో
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

పెద్ది చిత్రం 5వ రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. సోమవారం నాడు అగ్ని పరీక్షను విజయవంతంగా ఎదుర్కొన్నది. ఈ చిత్రం తెలుగులో 11 కోట్ల రూపాయలు వసూలు చేయగా, తమిళనాడులో 50 లక్షలు, కర్ణాటకలో 1.25 కోట్ల రూపాయలు, కేరళలో 6 లక్షలు, నార్త్ ఇండియా ఇతర ప్రాంతాల్లో 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తొలి సోమవారం 14.6 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
గత 5 రోజుల్లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రాలో 137 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 20 కోట్ల రూపాయలు, కేరళలో 60 లక్షల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 19 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 180 కోట్లకుపైగా నెట్, 201 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
హిందీ వెర్షన్ పెద్ది కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 2.25 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 2.75 కోట్ల రూపాయల గ్రాస్, నాలుగో రోజు 3.75 కోట్ల గ్రాస్, ఐదో రోజు 1.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గత 5 రోజుల్లో ఈ చిత్రం 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పెద్ది ఓవర్సీస్ విషయానికి వస్తే.. సోమవారం వర్కింగ్ డే ఎఫెక్ట్ భారీగానే పడింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఈ సినిమా ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 47 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 315 కోట్ల రూపాయల వసూలు చేసింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ చిత్రం మంగళవారం కూడా డ్రాప్‌తో కొనసాగుతున్నది. వర్కింగ్ డే కావడంతో వసూళ్లు పూర్తిగా క్షీణించాయి. ఈ చిత్రం నైట్ షోలకు డిమాండ్ పెరిగితే.. కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా 6వ రోజు సుమారుగా 6 నుంచి 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 320 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని లెక్కలు వేస్తున్నారు. 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 230 కోట్ల షేర్.. 440 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications