Peddi Day 7 Box Office Collections: బాక్సాఫీస్ క్రీజులో స్టడీగా పెద్ది.. రాంచరణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లను సాధిస్తున్న పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అవుతున్నది. తొలి వారాంతంలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తొలి సోమవారం తర్వాత కలెక్షన్ల పరుగులో వేగం తగ్గించింది. కానీ ఈ సినిమా నిలకడగా కలెక్షన్లను రాబడుతుండటం విశేషంగా మారింది. రాంచరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు పోతున్నది. ఈ చిత్రం గత 6 రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించింది? 7వ రోజు ఎంత వసూలు చేయనున్నది? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఎంత వసూలు చేయాల్సి ఉంది? అనే వివరాల్లోకి వెళితే..

గత 6 రోజుల్లో పెద్ది కలెక్షన్లు
పెద్ది చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలుపుకొని ఇండియాలో 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 27 కోట్ల రూపాయలు, మూడో రోజు ఈ చిత్రం 29 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 32 కోట్ల రూపాయలు, ఐదో రోజు 12 కోట్ల రూపాయలు, ఆరో రోజు 10 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 180 కోట్ల రూపాయలు నెట్, 216 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను దేశీయంగా వసూలు చేసింది.

Peddi Day 7 Expected Box Office

తెలుగు రాష్ట్రాల్లో రాంచరణ్ హవా
రాంచరణ్ వన్ మ్యాన్ షోగా రూపొందిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 171 కోట్ల రూపాయల గ్రాస్, 164 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. నైజాంలో 44.5 కోట్ల రూపాయలు వసూలు చేయగా, సీడెడ్‌లో 16.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 16.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 10.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయలు,గుంటూరులో 11 కోట్ల రూపాయలు, కృష్ణాలో 7.5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మిక్స్‌డ్‌గా దక్షిణాది రాష్ట్రాల్లో
పెద్ది తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో భారీగా వసూళ్లను సాధించింది. నార్త్ ఇండియా, ఇతర హిందీ రాష్ట్రాల్లో ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. తమిళనాడు, కేరళలో దారుణంగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం తమిళంలో ఇప్పటి వరకు 5.5 కోట్లు, కర్ణాటకలో 23.5 కోట్లు, కేరళలో 65 లక్షలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో ఎలా ఉందంటే?
ఈ సినిమాకు ఓవర్సీస్‌లో స్టడీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం 3 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 5.5 మిలియన్ డాలర్లు అంటే.. 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వారాంతంలో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

7వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
క్రికెట్, కుస్తీ, రన్నింగ్ స్పోర్ట్స్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించడంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 348 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక పెద్ది సినిమా 7వ రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం బుధవారం 6 నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం 350 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

పెద్ది లాభాల్లోకి రావాలంటే?
పెద్ది చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రాన్ని సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించామని దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 220 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 440 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. గత 7 రోజుల్లో ఈ చిత్రం 354 కోట్ల వసూళ్లను సాధించింది. ఇంకా ఈ చిత్రం సుమారుగా 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X