Peddi Day 8 Box Office Collections: జోరుగా రాంచరణ్ బాక్సాఫీస్ మాస్ బ్యాటింగ్.. పెద్దికి ఎన్ని వందల కోట్లంటే?
భారీ అంచనాలతో వచ్చిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేయకపోయిన నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి ప్రవేశించింది. అయితే ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడానికి వసూళ్ల పరంగా తంటాలు పడుతున్నది. ఈ చిత్రం గత 7 రోజుల్లో కలెక్షన్లు భారీగా సాధించినా పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల పరిస్థితి ఆశాజనకంగా లేదనే పరిస్థితి ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం 8వ రోజు కలెక్షన్ల ఎంత? ఇప్పటి వరకు ఈ సినిమా ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, ఓవర్సీస్‌లో భారీగా కలెక్షన్లు రాబట్టినప్పటికీ.. నార్త్ ఇండియా, కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో వసూళ్లను తీవ్రంగా నిరాశపరిచాయి. అయినప్పటికీ.. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 345 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ చిత్రం 350 కోట్ల రూపాయల మైలురాయికి చేరువ కావడం మెగా అభిమానులకు ఊరట కలిగించే అంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 280 నుంచి 285 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియా వైడ్ ఈ చిత్రం 240 కోట్ల రూపాయల గ్రాస్, 200 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. హిందీ వెర్షన్ 16 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు చేరువైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
పెద్ది చిత్రం ప్రీమియర్ల ద్వారా 38 కోట్ల రూపాయల గ్రాస్, తొలి రోజు 77 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో సుమారుగా 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని నిర్మాతలు ప్రకటించారు. ఇక రెండో రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 44 కోట్ల రూపాయల గ్రాస్, నాలుగో రోజు 47 కోట్ల రూపాయల గ్రాస్, 5వ రోజు 15 కోట్ల రూపాయల గ్రాస్, ఆరో రోజు 13 కోట్ల రూపాయల గ్రాస్, ఏడో రోజు 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 285 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రాల వారీగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్ల రూపాయల నెట్, తమిళనాడులో 5.35 కోట్లు, కర్ణాటకలో 24 కోట్ల రూపాయలు, కేరళలో 70 లక్షల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 22 కట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 224 కోట్ల రూపాయల నెట్, 285 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం 8వ రోజు కూడా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది. ఈ చిత్రం మరో 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 350 నుంచి 355 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications