Peddi Day 9 Box Office Collections: ఇండియాలో పెద్ది మరో సంచలన రికార్డు.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండో వారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధించడం డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఊరటగా మారింది. రాంచరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తొలివారంలో సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నది. ఈ చిత్రం అలాంటి ట్రోలింగ్‌ను అధిగమించి రియల్ అండ్ జెన్యూన్ ఆడియెన్స్ స్పందన పాజిటివ్‌గా రావడం, మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో తొలివారాంతం చివర్లో కలెక్షన్లు ఊపందుకొన్నాయి. అదే జోష్‌ను బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తున్నది. ఈ సినిమా గత 8 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది? 9వ రోజు ఏ మేరకు కలెక్షన్లను వసూలు చేయవచ్చనే అంచనా వివరాల్లోకి వెళితే..

పెద్ది చిత్రం ఇండియాలో అరుదైన ఘనతను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 230 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్, 193 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం 250 కోట్ల రూపాయల గ్రాస్, 200 కోట్ల రూపాయల నెట్ వసూళ్ల క్లబ్‌లో చేరేందుకు సిద్దమైంది. ఈ చిత్రం రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తుందనే ఆశాభావాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Peddi Day 9 Expected Box Office

పెద్ది చిత్రం గత 8 రోజులుగా తెలుగు, తమిళ, కన్నడ, కేరళ, హిందీ రాష్ట్రాల్లో వసూళ్లను భారీగా నమోదు చేసింది. కేరళ తమిళనాడులో ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 176 కోట్ల రూపాయల నెట్, కర్ణాటకలో 25 కోట్ల రూపాయలు, హిందీలో 24 కోట్ల రూపాయలు, తమిళంలో 6 కోట్ల రూపాయలు, కేరళలో 72 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. దాంతో ఈ చిత్రం 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఓవర్సీస్‌లో కూడా రాంచరణ్ మూవీ ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం ఆరంభంలో భారీగా వసూళ్లను రాబట్టినప్పటికీ.. తొలి వారాంతం తర్వాత ఈ చిత్రం వసూళ్లు సన్నగిల్లాయి. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లు. యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ తదితర రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 5 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారతీయ కరెన్సీలో ఈ చిత్రం 50 కోట్ల మైలురాయిని దాటిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక పెద్ది రెండో వారంలో రిలీజ్ తర్వాత 8వ రోజున కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం 8వ రోజు ఇండియాలో 6.30 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. 9వ రోజు కూడా అదే స్థాయిలో 6.5 కో ట్ల నుంచి 9 కోట్ల మధ్య నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 200 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 230 కోట్ల రూపాయలు గ్రాస్, 50 కోట్లకుపైగా ఓవర్సీస్ కలెక్షన్లతో ఈ చిత్రం 280 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక తొమ్మిదో రోజుతో కలిపి ఈ చిత్రం 290 కోట్ల రూపాయలకు చేరువ కానున్నది. అయితే చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ సినిమా 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X