Peddi Hindi Box Office: హిందీలో పెద్దికి ఊహించని దెబ్బ.. ఫస్ట్ వీక్‌లో రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. వృద్ది సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగులో పెద్దికి మంచి కలెక్షన్స్ వస్తుండగా.. హిందీలో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ఒకసారి పరిశీలిస్తే..
పెద్ది తారాగణం
పెద్ది సినిమాను దాదాపు 350 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలలో కలిపి 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో పెద్ది లాభాల్లోకి రావాలంటే 440 కోట్ల రూపాయల గ్రాస్.. 230 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్ణయించారు.

పెద్ది కలెక్షన్స్
పెద్దికి ప్రీమియర్స్ ద్వారా 18.50 కోట్ల రూపాయలు, తొలిరోజున 47.2 కోట్ల రూపాయలు, రెండో రోజున 24.2 కోట్ల రూపాయలు, మూడో రోజున 25.85 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 27.75 కోట్ల రూపాయలు, ఐదో రోజున 10.6 కోట్ల రూపాయలు, ఆరో రోజున 7.8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 6.1 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 187.25 కోట్ల రూపాయల నెట్.. 222.53 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ ప్రకటించింది.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 178.40 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 23.26 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.05 కోట్ల రూపాయలు, కేరళలో 53 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 21.11 కోట్ల రూపాయలు వసూలు చేసింది పెద్ది. భాషల వారీగా చూస్తే ఇప్పటి వరకు తెలుగు వెర్షన్‌లో 206.84 కోట్ల రూపాయలు, హిందీలో 18.09 కోట్ల రూపాయలు, తమిళ్‌లో 1.89 కోట్ల రూపాయలు, కన్నడంలో 1.29 కోట్ల రూపాయలు, మలయాళంలో 24 లక్షల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్
పెద్దికి ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఏడో రోజున నార్త్ అమెరికాలో 51000 డాలర్లు (భారత కరెన్సీలో 48.71 లక్షల రూపాయలు) వసూలు చేసింది. నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ తదితర దేశాలతో కలిపి పెద్దికి ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లు (48 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి పెద్దికి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 275 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది. అయితే ఇప్పటి వరకు పెద్ది మూవీ వరల్డ్ వైడ్‌గా 332.1 కోట్ల రూపాయల్ని రాబట్టినట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించింది.
పెద్ది హిందీ కలెక్షన్స్
పెద్దికి తొలిరోజున హిందీలో 3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.65 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.25 కోట్ల రూపాయలు చొప్పున తొలివారం హిందీలో 16.30 కోట్ల రూపాయల నెట్.. 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టింది పెద్ది.
తెలుగులో దూసుకెళ్తున్న పెద్ది.. హిందీలో మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించినా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఉన్నప్పటికీ నార్త్ ఆడియన్స్‌కు పెద్ది ఎందుకో కనెక్ట్ కాలేదు. తొలిరోజు నుంచి ఇప్పటి వరకు వసూళ్లు ఏ మాత్రం పుంజుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్ అన్ని బాగున్నప్పటికీ హిందీ జనాలు పెద్దిని పట్టించుకోవడం లేదు. జాన్వీ కపూర్ పాత్ర తాలుకా వివాదంతో పాటు ఈ తరహా సినిమాల్నీ ఆల్రెడీ చూసి ఉండటం కూడా పెద్ది వసూళ్లపై ప్రభావం చూపించిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
పెద్ది సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్‌ని జియో స్టూడియోస్ దక్కించుకుంది. దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా ఇక్కడ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇక్కడ బ్రేక్ఈవెన్ కావాలంటే పెద్ది కనీసం 50 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు 18 కోట్లు వసూలు చేయగా.. దాదాపు 30 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. మరి రానున్న రోజుల్లో పెద్ది ఏ స్థాయిలో రాణిస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications





