Peddi Hindi Collections: భారీగా క్షీణించిన పెద్ది హిందీ కలెక్షన్స్.. రామ్ చరణ్ మూవీ నష్టాలు తప్పించుకోవాలంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా పెద్ది. వృద్ది సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా... రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా పనిచేశారు. జూన్ 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో హిందీలో పెద్ది ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో పరిశీలిస్తే..

పెద్ది తారాగణం
పెద్ది సినిమాను దాదాపు 350 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలలో కలిపి 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో పెద్ది లాభాల్లోకి రావాలంటే 440 కోట్ల రూపాయల గ్రాస్.. 230 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్ణయించారు.

Peddi Hindi Collections Ram Charan Movie Struggles in North India Here is 14 days Box Office Report

పెద్ది కలెక్షన్స్
రామ్ చరణ్ మూవీకి ప్రీమియర్స్‌లో 18.5 కోట్ల రూపాయలు, తొలి రోజున 47.2 కోట్ల రూపాయలు, రెండో రోజున 24.2 కోట్ల రూపాయలు, మూడో రోజున 25.85 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 27.75 కోట్ల రూపాయలు, ఐదో రోజున 10.6 కోట్ల రూపాయలు, ఆరో రోజున 7.8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 6.1 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 5 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 4.5 కోట్ల రూపాయలు, పదో రోజున 7 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 7.8 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 3.4 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 2.75 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 226 కోట్ల రూపాయల నెట్.. 267.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 204 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.33 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 29 కోట్ల రూపాయలు, కేరళలో 72 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 28.42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నైజాం ఏరియాలో 50.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 19.50 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 21.31 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 12.15 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 8.46 కోట్ల రూపాయలు, గుంటూరులో 11.85 కోట్ల రూపాయలు, కృష్ణాలో 9.67 కోట్ల రూపాయలు, నెల్లూరులో 5.50 కోట్ల రూపాయలు చొప్పున 204 కోట్ల రూపాయల గ్రాస్.. 139 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది పెద్ది.

పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్
రామ్ చరణ్ మూవీకి నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 3.50 మిలియన్ డాలర్లు (33.13 కోట్ల రూపాయలు) వసూలైంది. ఇక గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు పెద్ది మూవీకి 52.45 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు రామ్ చరణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 320.20 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. అయితే పెద్ది సినిమా వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల మార్క్ దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించింది.

పెద్ది హిందీ కలెక్షన్స్
చిత్ర యూనిట్ అంచనా వేసిన స్థాయిలో పెద్ది హిందీలో ప్రభావం చూపకపోవడం టోటల్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. హిందీ బెల్ట్‌లో రామ్ చరణ్ సహా మూవీ యూనిట్ మొత్తం భారీగా ప్రమోషన్స్ జరిపినా ఉత్తరాది ప్రేక్షకుల నుంచి పెద్దికి అంతగా ఆదరణ దక్కలేదు. వీకెండ్‌లో ఓ మోస్తరుగా వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. వర్కింగ్ డేస్‌లో మాత్రం పెద్ది పూర్తిగా చేతులెత్తేస్తోంది.

పెద్దికి తొలిరోజున హిందీలో 3 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.65 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1.1 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 52 లక్షల రూపాయలు, పదో రోజున 90 లక్షల రూపాయలు, పదకొండో రోజున 1.2 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 60 లక్షల రూపాయలు, పదమూడో రోజున 60 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 35 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఉత్తరాదిన 21.57 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది.

హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో పెద్దికి 25 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ మూవీ అక్కడ బ్రేక్ఈవెన్ కావాలంటే దాదాపు 52 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 21.57 కోట్ల రూపాయల గ్రాస్.. 12 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రామ్ చరణ్ వసూలు చేశాడు. ఆల్‌మోస్ట్ హిందీలో పెద్ది జర్నీ ముగింపుకు చేరుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు ఈ శుక్రవారం హిందీలో షాహిద్ కపూర్ నటించిన కాక్‌టెయిల్ 2 సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకుని పెద్ది ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X