Peddi Hindi Collections: పెద్దికి హిందీలో షాకింగ్ కలెక్షన్స్... రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. వృద్ది సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? హిందీలో ఈ సినిమాకు ఇప్పటి వరకు వసూలైన కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే..

పెద్ది తారాగణం
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పెద్ది సినిమాను దాదాపు 350 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలలో కలిపి 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో పెద్ది లాభాల్లోకి రావాలంటే 440 కోట్ల రూపాయల గ్రాస్.. 230 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్ణయించారు.

Peddi Hindi Collections Ram Charan Movie Struggles in North India Here is 3 Days Box Office Report

పెద్ది కలెక్షన్స్
పెద్దికి ప్రీమియర్స్‌ ద్వారా 18.50 కోట్ల రూపాయలు, తొలిరోజున 51 కోట్ల రూపాయలు, రెండో రోజున 26.90 కోట్ల రూపాయలు, మూడో రోజున 28.85 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 125.75 కోట్ల రూపాయల నెట్.. 149.66 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 106.50 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 15.78 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3.35 కోట్ల రూపాయలు, కేరళలో 32 లక్షల రూపాయలు వసూలు చేసింది పెద్ది.

పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్
పెద్దికి ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజున ఓవర్సీస్‌లో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయగా.. రెండో రోజున 4 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు చొప్పున నార్త్ అమెరికా, గల్ఫ్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు 42 కోట్ల రూపాయలు రాబట్టింది పెద్ది. రామ్ చరణ్ మూవీకి నార్త్ అమెరికా నుంచి బలమైన వసూళ్లు నమోదవుతున్నాయి. మూడో రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 348K డాలర్లు (3.30 కోట్ల రూపాయలు) రాబట్టింది పెద్ది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా పెద్ది మూవీకి 192 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

పెద్ది హిందీ కలెక్షన్స్
పెద్ది సినిమాను నార్త్ ఇండియాలో జియో స్టూడియోస్ సంస్ధ భారీగా విడుదల చేసింది. అయితే అనుకున్న స్థాయిలో రామ్ చరణ్ మూవీ ఉత్తరాదిన ప్రభావం చూపలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ సహా కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలోనే పెద్ది హవా కనిపిస్తోంది. తొలి రోజున 3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన పెద్ది.. రెండో రోజు 2.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.80 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో నార్త్ ఇండియాలో 8 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

పెద్ది మంచి లాభాలు అందుకోవాలంటే హిందీ మార్కెట్‌లో ఖచ్చితంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. పుష్ప సిరీస్, కేజీఎఫ్ సిరీస్, కాంతారా, బహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు నార్త్ ఇండియా మార్కెట్ బ్రహ్మరథం పట్టడం వల్లే ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అయితే ఎందుకో పెద్దికి మాత్రం ఆ హవా కనిపించడం లేదు. ముంబై, ఢిల్లీ, భోపాల్‌లలో భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టినా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. మరి రానున్న రోజుల్లో పెద్ది హిందీ బెల్ట్‌లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X