Peddi Karnataka Closing Collections: పెద్ది కర్ణాటక క్లోజింగ్ కలెక్షన్లు.. రాంచరణ్ మూవీకి ఎంత నష్టమంటే?

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం కర్ణాటక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జర్నీని ముగించింది. గత రెండు వారాలుగా ఈ సినిమాను కన్నడ సినీ అభిమానులు గొప్పగా ఆదరించారు. సినిమాల రిలీజ్ సంక్షోభంలో కూరుకుపోయిన ఇండస్ట్రీకి కొత్త ఊపును ఈ సినిమా తెచ్చింది. ఉప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 4వ తేదీన రిలీజ్ మంచి వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఎంత? ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంత? ఈ మూవీకి కన్నడలో లాభాలా? నష్టాలా? అనే వివరాల్లోకి వెళితే..

పెద్ది మూవీ కర్ణాటక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. కన్నడలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఫ్యాన్పీ రేటుకు దక్కించుకొన్నారు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 17 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 18 కోట్ల రూపాయల షేర్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Peddi Karnataka Box Office Report

పెద్ది చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో ఓపెనింగ్స్ సాధించింది. ప్రీమియర్ల ద్వారా 3.10 కోట్ల రూపాయలు, ఒకటో రోజు 5.75 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారాంతం ముగిసే సరికి 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి వారం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. తొలివారం ముగిసే సరికి 24.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఈ సినిమా రెండో వారంలో తక్కువ వసూళ్లతోనే జర్నీని కొనసాగించినప్పటికీ.. నిలకడగా, యావరేజ్‌గా కలెక్షన్లను నమోదు చేయడంతో సుమారుగా 5 కోట్లు వసూళ్లను నమోదు చేసింది. ఇక మూడో వారంలో గత నాలుగు రోజుల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్ ధరలో దాదాపు 99 శాతం రికవరీని సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పెద్ది చిత్రం బెంగళూరులో ఇటీవల ప్రారంభమైన ఏఎంబీ మాల్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. అలాగే నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్‌లో కూడా భారీగా వసూళ్లను నమోదు చేయడం వల్ల దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పెద్ది సినిమా విషయానికి వస్తే.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరించారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X