Peddi Kerala Closing Collections: పెద్ది కేరళ క్లోజింగ్ కలెక్షన్లు.. రాంచరణ్ మూవీకి నష్టమా? లాభామా?

తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్న పెద్ది చిత్రం కేరళ బాక్సాఫీస్‌ను ప్రభావం చూపలేకపోయింది. మలయాళ సినిమా అభిమానుల అభిరుచికి తగినట్టుగా రూటెడ్ కంటెంట్ ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోవడంపై ట్రేడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం కేరళలో పేలవమైన వసూళ్లను రాబట్టింది. తొలివారంతోనే రాంచరణ్ నటించిన ఈ సినిమా తన వసూళ్ల ప్రయాణాన్ని ముగించింది. ఈ సినిమా మలయాళం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఏ మేరకు కలెక్షన్లను సాధించింది అనే వివరాల్లోకి వెళితే..

స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు దర్శకుడు బుచ్చిబాబు సనా తెలిపారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాల్లో భారీగా జరిగాయి. ఈ సినిమా కేరళ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 2 కోట్ల రూపాయలుగా వాల్యూ చేశారు. దాదాపు 2.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Peddi Kerala Box Office

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కేరళలో చేయకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లారు. దాంతో ఈ సినిమా విడుదల విషయం కూడా పెద్దగా రిజిస్టర్ కాకపోవడం ఓపెనింగ్స్‌పై భారీ దెబ్బ పడ్డాయి. రాంచరణ్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాకు పేలవంగా కలెక్షన్లు రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాత కూడా వసూల్ల పరంగా పుంజుకోలేకపోయింది. దాంతో నాసిరకమైన కలెక్షన్లతో ఈ సినిమా ప్రస్థానం మలయాళంలో ముగిసింది.

సాక్ నిక్ డేటా ప్రకారం.. ప్రీమియర్ల ద్వారా 1 లక్ష రూపాయలు, తొలి రోజు 25 లక్షల రూపాయలు, రెండో రోజు 7 లక్షల రూపాయలు, మూడో రోజు 10 లక్షల రూపాయలు, నాలుగో రోజు 10 లక్షల రూపాయలు, ఐదో రోజు 6 లక్షల రూపాయలు, ఆరో రోజు 6 లక్షలు, ఏడో రోజు 5 లక్షలు, ఎనిమిదో రోజు 2 లక్షల రూపాయలు వసూలు చేసింది అని తెలిపారు. దాంతో ఈ సినిమా మొత్తంగా 72 లక్షల రూపాయలు నెట్.. 1.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అని వెల్లడించారు.

పెద్ది చిత్రానికి దృశ్యం 3, మాలీవుడ్ టైమ్స్ చిత్రాలు భారీ పోటీగా ఇవ్వడంతో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అప్పటికే కొన్ని చిత్రాలు మలయాళంలో మంచి థియేట్రికల్ రన్ ఉండటంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా సుమారుగా కోటి రూపాయలకుపైగానే నష్టాలను నమోదు చేసిందనే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 375 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X