Peddi Box Office: పెద్ది డిజాస్టర్ కలెక్షన్లు.. పీకల్లోతు నష్టాల నుంచి బయటపడాలంటే?
పాన్ ఇండియా సినిమాగా రిలీజైన పెద్ది చిత్రం తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో మినహా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నదనే విషయం తాజా బాక్సాఫీస్ కలెక్షన్లతో స్పష్టమవుతున్నది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
అయితే తొలి ఆట తర్వాత ఈ సినిమా కొన్ని చోట్ల హిట్ టాక్, మరికొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్, ఇతర రాష్ట్రాల్లో డిజాస్టర్ టాక్‌తో ముందుకెళ్తున్నది. అయితే ఈ చిత్రానికి మలయాళం ప్రేక్షకుల ముఖం చాటేయడంతో అక్కడ బాక్సాఫీస్ పరిస్థితి దారుణంగా ఉందనే విషయం చిత్ర యూనిట్‌కు విస్మయం కలిగిస్తున్నది. గత మూడు రోజుల కేరళ బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనే వివరాల్లోకి వెళితే..

పెద్ది టీమ్ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ చేసింది. అయితే కారణాలేంటో తెలియదు గానీ.. ఈ సినిమా ప్రమోషన్స్‌ను కేరళలో పట్టించుకోలేదు. దాంతో ఈ సినిమా కేరళ భాషలో రిలీజ్ అవుతుందా? అనే అనుమానం కూడా క్రియేట్ అయిందనేది ఆ ప్రాంతంలో టాక్. దాంతో తొలి రోజు పేలవమైన ఓపెనింగ్స్ సాధించాయి. ఆ తర్వాత కూడా పెద్దగా కోలుకోలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రాంచరణ్ నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కేరళలో ఈ చిత్రం థియేట్రికల్ వాల్యూను 2.5 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంది. ఇలాంటి టార్గెట్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నాసిరకమైన పబ్లిసిటీ ప్రభావం బాక్సాఫీస్‌పై భారీగా పడిందనే టాక్ బలంగా వినిపిస్తున్నది.
ఇక పెద్ది సినిమా కేరళ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ సినిమా 25 లక్షలు, రెండో రోజు 7 లక్షల రూపాయలు, మూడో రోజు 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 42 లక్షల రూపాయల నెట్, 80 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 22 కోట్ల రూపాయలు తొలి రోజు 61 కోట్ల రూపాయలు, రెండో రోజు 32 కోట్ల రూపాయలు, మూడో రోజు 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 125 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కేరళలో పెద్ది సినిమా బ్రేక్ ఈవెన్ చేయడం కష్టంగానే కనిపిస్తున్నది. బాక్సాఫీస్ వద్ద ఏదో మ్యాజిక్ జరిగితే తప్పా.. ఈ సినిమా లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రమోషన్స్ దారుణంగా బెడసి కొట్టడం వల్లే ఈ సినిమాకు ఈ పరిస్థితి కనిపిస్తుందని.. లేకపోతే రాంచరణ్ క్రేజ్‌కు రిజల్ట్ వేరేలా ఉండేదనే టాక్ సర్వత్రా వినిపిస్తున్నది. ఈ సినిమాకు తెలుగు, కన్నడ ప్రేక్షకులు అండగా నిలవడం కొంత ఊరటగా మారింది.


Click it and Unblock the Notifications



