Peddi Overseas Business: ఓవర్సీస్‌లో ‘పెద్ది' ప్రభంజనం... రామ్ చరణ్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్ డీల్!

Peddi Overseas Business: మెగా పవర్ స్టార్ రామ్ (Ram Charan) నటిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది (Peddi). ఈ మూవీ రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ డీల్ వివరాలు చూస్తే.. ఇది చరణ్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా విడుదలకు చాలా సమయం ఉండగానే భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో 'పెద్ది' ప్రభంజనం క్రియేట్ చేస్తున్నట్టు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడైనట్టు తెలుస్తోంది.

పెద్ది సినిమాను 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్నారు. 1980ల రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో సాగే పవర్‌ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. సినిమాలో క్రికెట్ టోర్నమెంట్ థీమ్ కీలకంగా ఉంటుందని టాక్. చరణ్ ఇందులో పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సెట్స్ స్టిల్స్ చూస్తే అర్థమవుతోంది.

Peddi Overseas Business Ram Charan Creates All Time Record With 9 5M Overseas Deal Ahead of Release

రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కనిపించనున్నారు. సంగీత బాధ్యతలను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తీసుకోవడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, రాబోయే పాటలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

బడ్జెట్ విషయానికి వస్తే 'పెద్ది' మొత్తం ఖర్చు రూ.300 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. మేకింగ్ కాస్ట్ మాత్రమే ₹200 కోట్లను దాటుతున్నట్టు టాక్. ఇక రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కూడా దాదాపు ₹100 కోట్ల వరకు ఉంటుందని వినిపిస్తోంది. ఇప్పటికే 80 రోజుల షూటింగ్ పూర్తవగా, ఇంకా మరో 80 రోజుల వరకు షెడ్యూల్ మిగిలి ఉందట. భారీ యాక్షన్ సీన్స్, గ్రామీణ బ్యాక్‌డ్రాప్ సెట్స్ కారణంగా ఖర్చు పెరుగుతున్నా, ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నిర్మాతలకు రిస్క్ చాలా వరకు తగ్గినట్టే.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 'పెద్ది' ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ దాదాపు ఫైనల్ అయ్యాయి. నార్త్ అమెరికా రైట్స్‌ను సుమారు 7 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ 29 కోట్లు) క్లోజ్ చేసినట్లు సమాచారం. అలాగే మిగతా ప్రపంచ దేశాలైన ROW (Rest of World) మార్కెట్‌లో మరో 2.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10 నుంచి11 కోట్లు)వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఓవర్సీస్ బిజినెస్ లో రామ్ చరణ్ పెద్ది మూవీ 9.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ40 కోట్లు) అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది రామ్ చరణ్ ఇటీవలి సోలో సినిమాల్లో బెస్ట్ డీల్ కావడం విశేషం.

అలాగే.. ఓవర్సీస్ రైట్స్‌తో పాటు 'పెద్ది' నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో కూడా భారీ డీల్స్ క్లోజ్ చేసుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్ టీ-సిరీస్‌కు సుమారు ₹20-25 కోట్లకు పైగా అమ్ముడైనట్లు ట్రేడ్ టాక్. అలాగే OTT రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు ₹130 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ రెండు డీల్స్ ద్వారానే నిర్మాతలు దాదాపు ₹150 కోట్ల వరకు రికవరీ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల మాటల్లో చెప్పాలంటే.. ఈ డీల్ వెనుక ప్రధాన కారణం చరణ్‌కు వచ్చిన గ్లోబల్ ఇమేజ్. ముఖ్యంగా RRR తర్వాత చరణ్ ఫ్యాన్ బేస్ ఇంటర్నేషనల్ స్థాయిలో భారీగా పెరిగింది. గతంలో వచ్చిన కొన్ని సోలో సినిమాలు ఓవర్సీస్‌లో ఈ స్థాయి ప్రీ-సేల్స్ చేయలేకపోయినా, 'పెద్ది' మాత్రం షూటింగ్ దశలోనే రికార్డ్ బిజినెస్ నమోదు చేయడం ట్రేడ్‌ను ఆశ్చర్యపరుస్తోంది.

ఇక మేకర్స్ ఈ సినిమాను 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా, ఇప్పుడే ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డులు పడుతుండటం ఫ్యాన్స్‌లో హైప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో కూడా 'పెద్ది - రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ' అంటూ అభిమానులు ట్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రికార్డులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ బెంచ్‌మార్క్ కూడా మారబోతోందని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: peddi ram charan buchi babu sana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X