Peddi Overseas Box Office Collections: ఓవర్సీస్‌లో ‘పెద్ది' జోరు తగ్గిందా? రామ్ చరణ్ సినిమాకి ఎంత వచ్చిందంటే?

Peddi Box Office Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. తొలి వారం అద్భుతమైన వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం, రెండో వారంలోనూ చెప్పుకోదగ్గ స్థిరమైన కలెక్షన్లు అందుకుంటూ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్లను అందుకుంటుంది. అయితే.. పెద్ది సినిమా నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ప్రస్తుత పరిస్తితిని చూస్తే.. ఆ ట్రెండ్‌ను కొనసాగించలేకపోయిందనే విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ది ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తాజా ట్రేడ్ లెక్కల ప్రకారం.. పెద్ది సినిమా 9వ రోజు దేశవ్యాప్తంగా 3,816 షోలలో 5.15 కోట్ల రూపాయాల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి అత్యధికంగా రూ. 4.50 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకోగా, హిందీ వెర్షన్ నుంచి రూ. 52 లక్షలు, కన్నడ వెర్షన్ నుంచి రూ. 8 లక్షలు, తమిళ వెర్షన్ నుంచి రూ. 5 లక్షలు రాబట్టింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెద్ది మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 198. 70 కోట్లకు చేరాయి.

Peddi Overseas Collections

ఇక గ్రాస్ పరంగా చూస్తే ఈ సినిమా రూ. 235. 98 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో తెలుగు మార్కెట్‌లో 'పెద్ది'స్ట్రాంగ్ హోల్డ్‌ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మరో రూ. 1.30 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల నెట్ మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'పెద్ది'తన జోరును కొనసాగిస్తోంది. వెంకీ బాక్సాఫీస్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. పెద్ది సినిమా నార్త్ అమెరికా మార్కెట్‌లో తొమ్మిదో రోజు (Day 9) కూడా స్థిరమైన వసూళ్లను నమోదు చేస్తోంది. శుక్రవారం నాడు 123 లొకేషన్ల నుంచి ఈ సినిమా 47 వేల డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు (సుమారు 40. 4 లక్షల రూపాయాలు) వెల్లడించింది. ఇక ఇతర దేశాల్లో మరో రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలన వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. పెద్ది మూవీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేసిన తాజా పోస్టర్ ప్రకారం.. పెద్ది సినిమా తొమ్మిది రోజుల్లో నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 3.2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 27.5 కోట్ల రూపాయాలు. 'పెద్ది 3.2 మిలియన్ అండ్ కౌంటింగ్' అంటూ విడుదలైన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లను రూ.50 కోట్ల గ్రాస్ మార్క్‌కు క్రాస్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఇండియన్ బాక్సాఫీస్, ఓవర్సీస్ కలెక్షన్లు కలిపి చూస్తే పెద్ది మొత్తం రూ. 285.98 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతుండగా.. మరోవైపు..ఈ ఏడాదిలో సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పెద్ది' నిలిచిందనీ, విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు మూవీ మేకర్స్ ప్రకటించడం విశేషం. మొత్తంగా పెద్ది మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో, మరో రెండు మూడు రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X