Peddi Nizam, AP Business: పెద్ది ఏపీ, నైజాం ప్రీ రిలీజ్ బిజినెస్ రాంచరణ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ఆంధ్రా, నైజాం, సీడెడ్‌లో చేసిన బిజినెస్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

విజయనగరం గ్రామీణ ప్రాంతంలో నేపథ్యంగా పెద్ది సినిమా పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం భారీగా సెట్స్ వేశారు. దాంతో ఈ చిత్రంలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ చిత్రం బడ్జెట్ 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ తర్వాత అంచనాలు భారీగా పెరిగిపోయాయి. క్రికెట్ షాట్ దేశవ్యాప్తంగా సునామీ ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రానికి నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో ఫ్యాన్సీ రేటును చెల్లించి థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నారు.
పెద్ది సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ భారీ రేటును చెల్లించి దక్కించుకొన్నారు. ఈ సినిమా తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 63 కోట్ల రూపాయలకు, ఆంధ్రా రైట్స్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 27 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 165 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
పెద్ది సినిమా హై రేంజ్ బిజినెస్ తర్వాత అంచనాలు, బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 170 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కనీసం 340 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది అని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషించారు. అయితే ఈ సినిమా రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications