Peddi Pre Release Business: పెద్ది రిలీజ్ ముందే విధ్వంసం.. రామ్‌చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది (Peddi). ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 'గేమ్ ఛేంజర్' ఫలితంతో సంబంధం లేకుండా రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏమిటో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ, థియేటర్లలోకి రాకముందే రికార్డు స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్ వివరాలు చూస్తే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తుండగా, చరణ్‌ను పూర్తి రగ్గడ్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఏ.ఆర్. రెహమాన్ (A.R.Rahman)కంపోజ్ చేసిన ఈ పాటలో చరణ్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సింగిల్ 'రై రై రా రా'ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Peddi Pre-Release Business Ram Charan s Film Crosses 275 Cr Non-Theatrical Revenue Before Release

రెహమాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్‌ఫుల్ డ్యాన్స్ నంబర్ ప‌ల్సేటింగ్ బీట్స్‌తో మాస్ ఎనర్జీని పంచుతోంది. స్టార్ ఎంట్రీ సాంగ్‌గా రూపొందిన ఈ పాటలో చరణ్ తన ట్రేడ్‌మార్క్ మాస్ స్టైల్, ఫ్లూయిడ్ మూవ్‌మెంట్స్‌తో అదరగొట్టారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అనంత శ్రీరామ్ సాహిత్యం పాటను మరింత ఎలివేట్ చేశాయి.ఈ సాంగ్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.'పెద్ది' ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

డిజిటల్ రైట్స్- నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారానే నిర్మాతలను సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. లేటేస్ట్ అంచనాల ప్రకారం.. పెద్ది సినిమా సాధించిన రికార్డు బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.'పెద్ది' డిజిటల్ (OTT) హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫెక్స్ (Netflix) గట్టి పోటీ మధ్య సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషలకు కలిపి రూ.115 నుంచి రూ.130 కోట్ల మధ్య ఈ ఒప్పందం కుదిరిందని ట్రేడ్ వర్గాల అంచనా. అంతేకాదు, సినిమా ప్లాట్‌ఫామ్‌పై భారీ హిట్‌గా నిలిస్తే అదనంగా రూ.20 కోట్ల 'పర్ఫార్మెన్స్ బోనస్' క్లాజ్ కూడా ఉండొచ్చని టాక్.

శాటిలైట్ హక్కులు- భారీ పోటీ
శాటిలైట్ హక్కుల విషయంలో కూడా ఛానెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌కు మాత్రమే రూ.35-40 కోట్ల మధ్య ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. హిందీ మరియు ఇతర భాషలతో కలిపి మొత్తం శాటిలైట్ డీల్ రూ.50 నుంచి రూ.70 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ఆడియో హక్కులు - ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్
ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమన్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-Series ఏకంగా రూ.35 కోట్లకు ఆడియో హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటికే విడుదలైన 'చికిరి' సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవడం, తాజాగా వచ్చిన 'రై రై రారా' పాటకు మంచి స్పందన రావడం సినిమాపై బజ్‌ను మరింత పెంచింది.

ఓవర్సీస్ మార్కెట్ - గ్లోబల్ క్రేజ్
రామ్ చరణ్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు కారణంగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారానే సుమారు రూ.40 కోట్ల వరకు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత చరణ్ గ్లోబల్ ఇమేజ్ గణనీయంగా పెరగడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

ఇలా మొత్తం నాన్-థియేట్రికల్ వివరాలను పరిశీలిస్తే.. డిజిటల్ (Netflix): రూ.115-130 కోట్లు (+బోనస్ క్లాజ్), శాటిలైట్ రైట్స్ రూ 50-70 కోట్లు, ఆడియో రైట్స్ (T-Series) రూ.35 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ 40 కోట్లు మేరకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం, 'పెద్ది' నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే రూ.275 కోట్ల మార్క్ దాటిందని ట్రేడ్ అంచనా. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో వేచిచూడాలి.

More from Filmibeat

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X