Peddi Worldwide Business: పెద్ది వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రాంచరణ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? రిలీజ్ తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

పెద్ది సినిమా పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం భారీగా సెట్స్ వేశారు. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా పాన్ ఇండియా స్థాయి యాక్టర్లను, అలాగే ఏఆర్ రెహ్మాన్ లాంటి టాప్ టెక్నిషియన్లను ఈ సినిమా కోసం సెట్ చేశారు. దాంతో ఈ చిత్రంలో నటించిన యాక్టర్లు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ చిత్రం బడ్జెట్ 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే నాన్ థియేట్రికల్, థియేట్రికల్ పరంగా రికార్డు స్థాయి బిజినెస్ చేసింది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 625 కోట్ల రూపాయల మేర జరిగింది. నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే.. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ బిజినెస్ 275 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తెలుగు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాష ఓటీటీ రైట్స్ సుమారుగా 130 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలకు సంబంధించిన ఈ చిత్రం హక్కులు సుమారుగా 165 కోట్ల మేర అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయలు , కర్ణాటక (25 కోట్లు), తమిళనాడు (15 కోట్లు) , కేరళ (7 కోట్లు) , నార్త్ ఇండియా (100 కోట్లు) ఏరియా వారీగా బిజినెస్ బిజినెస్ సుమారుగా 350 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం బిజినెస్ మొత్తం 625 కోట్ల రూపాయలు మేర జరిగిందని తెలిసింది. ఆ సినిమాను నార్త్ ఇండియాలో భారీ ఎత్తున జియో స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నది.
పెద్ది సినిమా రికార్డు బిజినెస్ జరిగిన తర్వాత బాక్సాఫీస్ జర్నీకి సిద్దమైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేయాల్సి ఉంది. ఈ మేరకు వసూళ్లను సాధించగలిగితే.. లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications