Peddi: నార్త్ అమెరికాలో పెద్ది ఊచకోత.. రిలీజ్‌కు ముందే నయా రికార్డు..

Peddi: భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా పెద్ది (Peddi). ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా, బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, సాంగ్స్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లో సంచలన రికార్డులతో వార్తల్లో నిలిచింది. ఇంతకీ పెద్ది ప్రి రిలీజ్ బిజినెస్ ఎలా సాగుతోంది?

1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక సాధారణ యువకుడు స్పోర్ట్స్‌ను ఆయుధంగా చేసుకుని సమాజాన్ని ఏకం చేసే విధానం ప్రధానాంశంగా ఉండనుందని సమాచారం. ఈ కథలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషనల్ కోర్ కూడా ఉంటుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఇదే ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Peddi Pre-Sales Cross 350K in North America Ram Charan Film Creates Huge Buzz Ahead Release

ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత 'పెద్ది'పై హైప్ మరింత పెరిగింది. ట్రైలర్‌లో రామ్ చరణ్ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఒకవైపు గ్రామీణ నేపథ్యంలోని క్రికెటర్‌గా, మరోవైపు భారీ కాయంతో 'పెద్ది పహిల్వాన్'గా కనిపిస్తూ చరణ్ తన యాక్టింగ్ వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మాస్ ఎలివేషన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉన్నాయని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) ట్రైలర్‌తోనే తన మ్యూజిక్ మ్యాజిక్ చూపించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. విజువల్స్, ఎమోషన్స్, మ్యూజిక్ మేళవింపు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు అందించిన విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

పెద్ది బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 100,000 అమెరికన్ డాలర్లు ($100K)క్రాస్ చేసి, తర్వాత వరుసగా 250,000 అమెరికన్ డాలర్లు ($250K), 300,000 అమెరికన్ డాలర్లు($300K) మైలురాళ్లను దాటింది. ఇక తాజా ట్రేడ్ అప్‌డేట్స్ ప్రకారం.. పెద్ది నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ 350,000 అమెరికన్ డాలర్లు ($350K) మార్క్‌ను దాటడం విశేషం. అంటే, రూ 2.9 కోట్లు (దాదాపు 3 కోట్లు)దాటింది. దీంతో రామ్ చరణ్ ఓవర్సీస్ స్టామినా మరోసారి రుజువు చేసింది.

ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ నంబర్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. భారీ స్టార్ క్యాస్టింగ్, టాప్ టెక్నికల్ టీమ్ అన్ని కలిసి 'పెద్ది'ని ఒక గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ఓవర్సీస్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. నార్త్ అమెరికాలో 450కు పైగా లొకేషన్లలో, 1300కు పైగా షోలతో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జూన్ 3న ప్రీమియర్ షోలు, జూన్ 4న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.

'పెద్ది' సినిమా రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికాలో రికార్డు స్థాయి ప్రీ-సేల్స్ సాధించడం. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ మరో గ్లోబల్ హిట్ అందుకుంటారా? బుచ్చిబాబు సానా తన రెండో సినిమాతోనే మేజర్ బ్లాక్‌బస్టర్ కొడతారా? అన్న ఉత్కంఠ ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల చూపు 'పెద్ది'పైనే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X