Peddi Overseas Premiers Collections: పెద్ది ఓవర్సీస్ ప్రీమియర్ షో కలెక్షన్లు.. రాంచరణ్ సరికొత్త రికార్డు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా పెద్ది ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ.. జూన్ 3వ తేదీన ప్రారంభం కాగానే కలెక్షన్లు ఊపందుకొన్నాయి. రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడంతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాంచరణ్ కెరీర్‌లో సానుకూలమైన కలెక్షన్లను రాబడుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఎంత వసూలు చేసింది? ఓవర్సీస్ మార్కెట్‌లో ఏ మేరకు కలెక్షన్లు నమోదు చేసిందనే వివరాల్లోకి వెళితే..
యూఏస్ఏలో పెద్ది సినిమా అడ్వాన్స్ బుకింగ్ వారం క్రితమే ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కిక్కు ఇవ్వకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్‌పై కొంత ప్రభావం చూపించింది. కానీ ప్రమోషన్స్‌కు మంచి స్పందన రావడంతో అమెరికాలో కలెక్షన్లు ఊపందుకొన్నాయి. ఈ సినిమాను అమెరికాలో 610 లోకేషన్లలో 1850 షోలకుపైగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక పెద్ది సినిమా అమెరికా ప్రీమియర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రీమియర్లకు మంచి స్పందన కనిపించింది. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రదర్శించిన ప్రీమియర్లకు సుమారుగా 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తద్వారా ఈ చిత్రం 1.02 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 10 కోట్ల రూపాయలు, కెనడాతో కలిపి 1.235 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రాంచరణ్ కెరీర్‌లో 2వ అతిపెద్ద వసూళ్లుగా ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.
ఇక ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు కలిపి సుమారుగా 1.65 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యూకేలో 25 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా వెల్లడించింది.
పెద్ది సినిమా విషయానికి వస్తే.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అయింది.


Click it and Unblock the Notifications