Peddi Kannada Collections: కర్ణాటకలో పెద్ది జోరు... కన్నడ గడ్డపై రామ్ చరణ్ సరికొత్త చరిత్ర

2026లో టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన మూవీ పెద్ది. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ కావడంతో పాటు ఉప్పెన తర్వాత బుచ్బిబాబు డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పెద్దిపై హైప్ క్రియేట్ చేసింది. దీనికి తోడు టీజర్, ట్రైలర్లు, రామ్ చరణ్ పహిల్వాన్ లుక్, పాటలు ఈ సినిమాపై బజ్ పెంచింది. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా పెద్ది ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే జూన్ 3న ఈ మూవీని భారత్, నార్త్ అమెరికాతో పాటు కొన్ని ఏరియాలలో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్ వసూళ్లలో రామ్ చరణ్ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించింది. దీనిలో భాగంగా కర్ణాటకలో పెద్ది ప్రీమియర్స్ కలెక్షన్స్ పరిశీలిస్తే..

పెద్ది తారాగణం
వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంస్ధలు సమర్పిస్తున్నాయి.పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌తో అలరించనున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా పనిచేశారు.

Peddi Premieres Collection Ram Charan s film created all-time premiere record in Karnataka with a massive Collection

పెద్ది బడ్జెట్ ఎంత?
నటీనటులు సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి పెద్దికి 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. అలాగే వరల్డ్ వైడ్‌గా పెద్ది సినిమాకు 350 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 700 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. కర్ణాటకలో పెద్ది హక్కులను 25 కోట్ల రూపాయలకు కిశోర్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ రామ్ చరణ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 50 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

పెద్ది అడ్వాన్స్ బుకింగ్‌
రామ్ చరణ్‌ సినిమాలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. దీనికి తగినట్లుగానే పెద్ది ప్రీమియర్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. ప్రీమియర్స్‌కు బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. జూన్ 2వ తేదీ ఉదయం నాటికే కర్ణాటకలో ప్రీమియర్స్ అడ్వాన్స్ కలెక్షన్స్ ఏకంగా కోటి రూపాయల మార్క్ దాటేసింది. మొత్తంగా పెద్దికి ప్రీమియర్స్‌లో కర్ణాటక వ్యాప్తంగా 3.07 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పెద్ది కర్ణాటక ప్రీమియర్స్ కలెక్షన్స్
తద్వారా కర్ణాటకలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రాల్లో ఇప్పటి వరకు నెంబర్‌వన్‌గా ఉన్న ఓజీ (2.72 కోట్ల రూపాయలు) రికార్డును పెద్ది బద్ధలు కొట్టింది. ఆ తర్వాత ది రాజా సాబ్ (2.61 కోట్ల రూపాయలు), పుష్ప 2 (2.55 కోట్ల రూపాయలు), హరిహర వీరమల్లు (1.47 కోట్ల రూపాయలు) తో నిలిచాయి. ప్రీమియర్స్‌లో పాజిటివ్ టాక్ నేపథ్యంలో పెద్దికి కర్ణాటకలో బుకింగ్స్ ఊపందుకున్నాయి. తొలిరోజున ఒక్క బెంగళూరు సిటీలోనే ఏకంగా 1071 షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. బెంగళూరులో తొలిరోజున వెయ్యికి పైగా షోలు ప్రదర్శించిన సినిమాలు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి (3), పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌కి (3), దళపతి విజయ్‌కి (2) ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ పెద్దితో రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు.

పెద్ది యూఎస్ఏ ప్రీమియర్స్ కలెక్షన్స్
ప్రీమియర్ షోలలో పెద్దికి వరల్డ్ వైడ్‌గా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 10.74 కోట్ల రూపాయలు, తెలంగాణలో 6.97 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.09 కోట్ల రూపాయలు, తమిళనాడులో 32 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2 లక్షల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా పెద్దికి ప్రీమియర్స్‌లో 21.13 కోట్లు వసూలైంది. అమెరికాలో 610 సెంటర్స్‌లో 1854 షోలు ఏర్పాటు చేయగా.. 36813 టికెట్లు అమ్ముడై 1,022,841 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 10 కోట్ల రూపాయలు) రాబట్టింది.

పెద్ది వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ కలెక్షన్స్
రామ్ చరణ్ జోరు చూస్తుంటే మొత్తం నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌ ద్వారా 1.5 మిలియన్ డాలర్లు (14.35 కోట్ల రూపాయలు) రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా పెద్దికి ప్రీమియర్స్‌లో ఓవర్సీస్ నుంచి 20 కోట్ల రూపాయలు రావొచ్చని భావిస్తున్నారు. దాంతో వరల్డ్ వైడ్‌గా రామ్ చరణ్ మూవీ ప్రీమియర్స్‌లో 40 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని చెబుతున్నారు. తద్వారా తొలిరోజున పెద్దికి 120 నుంచి 150 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X