Peddi Premiers Collections Worldwide: పెద్ది ప్రీమియర్ కలెక్షన్లు. రాంచరణ్ మూవీకి వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు?
పెద్ది సినిమా విషయానికి వస్తే.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ వసూలు చేసిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పెద్ది సినిమా ప్రీమియర్ షో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి సంబంధించి 2800 లోకేషన్లలో 13 వేల షోలు ప్రదర్శించారు. దాదాపు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాదాపు 16 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయనే విషయం బుక్ మై షో, డిస్ట్రిక్ట్, తదితర యాప్‌లో అమ్మకాల ద్వారా స్పష్టమైంది. ఈ చిత్ర ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల రూపాయల నెట్, 39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ప్రీమియర్ల ద్వారా సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు కలిపి సుమారుగా 1.65 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యూకేలో 25 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా వెల్లడించింది.
తొలి రోజు షోల విషయానికి వస్తే.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన పెద్ది చిత్రం ఇండియాలో 4300 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు వెర్షన్ 2800 షోలు, హిందీ 1100 షోలు, తమిళం 235 షోలు, కన్నడ 54 షోలు, మలయాళం 100 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా 28 లక్షల టికెట్ల అమ్మకాలు జరిగాయని తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో తాజా సమాచారం ప్రకారం 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications