Peddi USA Collections: నార్త్ అమెరికాలో పెద్ది ప్రభంజనం.. రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi USA Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా , దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. తొలి రోజు వసూళ్లతో ఆ అంచనాలను అందుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా నార్త్ అమెరికాలో ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా, తొలి రోజు ఈ సినిమా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సోలో మూవీగా పెద్ది రికార్డు నెలకొల్పింది.

Peddi USA Collection Ram Charan s Sports Drama Creates Box Office Storm in North America

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ 'సాక్నిల్క్' వెల్లడించిన సమాచారం ప్రకారం.. 'పెద్ది' సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా సుమారు 12,412 షోలలో ప్రదర్శించబడింది. తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.51 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రిమియర్స్ ద్వారా రూ.18.50 కోట్ల వసూలు చేసింది. దీంతో ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ.82.49 కోట్లకు చేరగా, ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.69.50 కోట్లుగా నమోదయ్యాయి. ఈ భారీ కలెక్షన్లు లో అత్యధిక వాటా తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు రూ.48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటకలో రూ.5.75 కోట్లు, తమిళనాడులో రూ.1.50 కోట్లు, కేరళలో రూ.25 లక్షలు, ఇతర ప్రాంతాల్లో కలిపి రూ.5.16 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ముఖ్యంగా కర్ణాటకలో ప్రీమియర్ షోల నుంచే భారీ స్పందన రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఇక ఓవర్సీస్ లో కూడా 'పెద్ది'ప్రభంజనం కొనసాగుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రధాన మార్కెట్లలో ఈ సినిమాకి భారీ స్పందన లభించింది. తొలి రోజు ఓవర్సీస్ నుంచి సుమారు రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇందులో నార్త్ అమెరికా నుంచి పెద్ది మూవీకి భారీ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం.. 'పెద్ది' ప్రీ మియర్స్‌తో పాటు తొలి రోజు షోలు కలిపి ఇప్పటికే 1.9 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందట. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌కు సమానం. ఈ స్పందన చూస్తుంటే.. పెద్ది త్వరలోనే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా లెక్కలు చూస్తుంటే.. రామ్ చరణ్ కెరీర్‌లో ఓవర్సీస్ మార్కెట్‌లో నమోదైన అతిపెద్ద ఓపెనింగ్స్‌లో 'పెద్ది' ఒకటిగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు నమోదు చేసిన ఈ సినిమా , విడుదల అనంతరం కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివస్తుండటంతో అమెరికాలోని పలు ప్రధాన సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' తొలి రోజు గ్రాస్ కలెక్షన్స్ రూ.112.49 కోట్లకు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X